RR vs LSG: యశస్వి జైస్వాల్‌ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై 2 పరుగుల తేడాతో లక్నో ఉత్కంఠ విజయం

Lucknow Super Giants Beat Rajasthan Royals By 2 Runs: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ప్లేఆఫ్స్‌ బరిలో ఉండేందుకు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అత్యంత ఉత్కంఠ కలిగించిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై లక్నో సూపర్‌ జియాంట్స్‌ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 19, 2025, 11:34 PM IST
RR vs LSG: యశస్వి జైస్వాల్‌ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై 2 పరుగుల తేడాతో లక్నో ఉత్కంఠ విజయం

RR vs LSG Highlights: ఐపీఎల్‌ సీజన్‌ ద్వితీయార్థం చేరుకోగా.. జట్లు ప్లేఆఫ్స్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బరిలో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జియాంట్స్‌ తీవ్రంగా పోరాడగా.. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు లక్నో సూపర్‌ జియాంట్స్‌ విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: Jos Buttler: బ్యాట్‌తో బట్లర్‌ పరుగుల సునామీ.. ఢిల్లీపై గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (4) తక్కువ స్కోర్‌కే ఔటవగా.. ఐడెన్‌ మర్‌క్రమ్‌ 45 బంతుల్లో 66 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్‌ చేశారు. నికోలస్‌ పూరన్‌ (11).. కెప్టెన్‌  రిషబ్‌ పంత్‌ 3 పరుగులకే పరిమితమయ్యాడు. ఆయుశ్‌ బదౌన్‌ 34 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటారు. డేవిడ్‌ మిల్లర్‌ 7 పరుగులకు ఔటవగా.. అబ్దుల్‌ సమద్‌ 30 స్కోర్‌ చేశాడు. లక్నో బౌలర్లు పొదుపుగా బంతులు వేసి రాజస్థాన్‌ భారీ స్కోర్‌ రాకుండా అడ్డుకున్నారు. వహిందు హసరంగ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Also Read: DC vs RR Super Over: నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ 'సూపర్‌' విజయం.. అసలైన మజా అంటే ఇదే!

రాజస్థాన్‌ విధించిన స్కోర్‌ను ఛేదించడానికి ఆఖరి బంతి వరకు రాజస్థాన్‌ పోరాడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగల వద్ద పోరాటం ఆపివేసింది. అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ 34 పరుగులతో సంచలన ప్రదర్శన చేయగా.. యశస్వీ జైస్వాల్‌ మరోసారి దుమ్మురేపాడు. 52 బంతుల్లో 74 పరుగులు బాదేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 5 ఫోర్లు, 4 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. నితీశ్‌ రాణా (8) తక్కువ పరుగులకే పరిమితమవగా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 39 పరుగులతో రాణించి విజయం కోసం శ్రమించాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్‌ జురేల్‌ (6*), షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ (12), శుభమ్‌ దుబే (3) పోరాడినా కూడా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయారు. 

ఒక్క పరుగు తీసి సూపర్‌ ఓవర్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ వెళ్దామని వ్యూహం వేస్తే ఆ వ్యూహం పారకుండా ఆవేశ్‌ ఖాన్‌ అడ్డుకున్నాడు. లక్నో బౌలర్లు బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ వేసిన ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. టగ్‌ ఆఫ్‌ వార్‌గా ఉన్న సమయంలో తెలివిగా బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు తీయకుండా అడ్డుకున్నాడు. మూడు వికెట్లతో ఆవేశ్‌ అదరగొట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌, మర్‌క్రమ్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఐదు మ్యాచ్‌లు సొంతం చేసుకోగా.. మూడింట ఓడిపోయి ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ రాయల్స్‌ కేవలం రెండింట విజయం సాధించి 6 మ్యాచ్‌లను కోల్పోయింది. దీంతో దాదాపుగా ప్లేఆఫ్స్‌ ఆశలను వదులుకుంటోంది. టోర్నీ రేసులో ఉండాలంటే ఇక ఆడబోయే ప్రతి మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ తప్పక విజయాలు సాధించాల్సిందే. మరి జరుగుతుందో తదుపరి మ్యాచ్‌ల్లో తేలనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News