IPL 2025 DC vs RR Super Over: మ్యాచ్ అంటే ఇది.. ఒక్కో బాల్ నరాలు తెగే ఉత్కంఠ కలిగించగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో ఎలా.. 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి మ్యాచ్‌ను టైగా మార్చింది. అత్యంత రేపిన ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉందో చూద్దాం.
Also Read: PBKS vs KKR Highlights: నిప్పులు చెరిగిన బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై పంజాబ్ విజయం
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి స్కోర్‌ను సమం చేసి సూపర్ ఓవర్‌కు దారితీసింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్ (9), అభిషేక్ పరేల్ (49) సత్తా చాటి ఒక్క పరుగుతో అర్థ సెంచరీని కోల్పోయాడు. కరుణ్ నాయర్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (38) రాణించగా.. త్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 34 స్కోర్ చేయగా.. అశుతోష్ శర్మ 15 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లు బంతితో చక్కటి బౌలింగ్ వేసి పరుగులను నియంత్రించారు. వికెట్లు తీస్తూనే పరుగులను కంట్రోల్ చేశారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, మహీశ్ తీక్షణ, వహింద్ హసరంగా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: LSG vs CSK: లక్నోకు భారీ షాక్.. చావోరేవో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయం
రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి మ్యాచ్ ఫలితం తేలకుండా నిలిపింది. ప్రత్యర్థికి దీటుగా ఆడినా కూడా ఫలితం తేలలేదు. యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు చేయగా.. కెప్టెన్ సంజూ శామ్‌సన్ 31 స్కోర్ చేశాడు. రియాన్ పరాగ్ (8) తక్కువ స్కోర్ చేయగా.. నితీశ్ రాణా 28 బంతుల్లో 51 పరుగులు చేసి సంచలన ప్రదర్శన చేశాడు. ధ్రువ్ జురేల్ (26), షిమ్రాన్ హెట్‌మెయిర్ (15*) రాణించి మ్యాచ్‌ను టై చేశారు. తమపై ప్రతాపం చూపిన రాజస్థాన్‌పై అదే స్థాయిలో ఢిల్లీ బౌలర్లు ప్రతాపం చూపారు. అయితే పరుగులను నియంత్రిస్తూనే వికెట్లు తీయడంలో కొంత తడబడ్డారు. అయినా కూడా మ్యాచ్‌ను ఉత్కంఠ రేపేలా చేశారు. 8 మంది బౌలింగ్ వేయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









