IPL 2025 PBKS vs KKR Highlights: పరుగుల సునామీ పారే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతి తక్కువ స్కోర్ రాగా.. బ్యాటర్లంతా విఫలమైన వేళ బౌలర్లు బంతులతో చెలరేగిపోయారు. బ్యాటర్లపై కోపం ఉన్నట్టు నిప్పులు చెరిగారు. పరుగులు తక్కువే కానీ అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
Also Read: LSG vs CSK: లక్నోకు భారీ షాక్.. చావోరేవో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయం
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లకు 111 పరుగులు చేసి కుప్పకూలింది. కోల్‌కత్తా బౌలర్ల దెబ్బకు కింగ్స్ బ్యాటర్లు టపాటపా వికెట్లు కోల్పోయారు. టాపార్డర్‌తో సహా అందరూ బ్యాటర్లు అతి తక్కువ పరుగులు చేసి ఔటయ్యారు. ప్రభు సిమ్రాన్ సింగ్ చేసిన 30 పరుగులే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ప్రియాన్షు ఆర్య 22 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. జోష్ ఇంగ్లిష్ (2), నేహాల్ వదేరా (10), గ్లెన్ మాక్స్‌వెల్ (7), సూర్యాన్షు షెగ్డే (4), శశాంక్ సింగ్ (18), మార్కో జేన్సన్ (11) అతి తక్కువ పరుగులు చేసి అతి తక్కువ స్కోర్ చేశారు.
Also Read: DC vs MI Live: ఢిల్లీ జైత్రయాత్రకు బ్రేక్.. ముంబై ఇండియన్స్‌పై పోరాడి ఓడిన క్యాపిటల్స్
నత్తను మించిన స్కోర్ బోర్డు
కోల్‌కత్తా బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం పరుగులు చేయకుండా బౌలర్లు అడ్డుకట్ట వేశారు. హర్షిత్ రానా 3 వికెట్లతో పంజాబ్‌ను తీవ్రంగా దెబ్బతీశారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్టే ఒక్కొక్క వికెట్ తీశారు.
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఘోర విఫలం
అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ దారుణంగా విఫలమైంది. 15.1 ఓవర్లకు 95 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బౌలింగ్ పిచ్‌పై బ్యాటర్లు ఆడలేక తడబడ్డారు. రఘువంశీ చేసిన 37 పరుగులు అత్యధిక స్కోర్ కాగా టాపార్డర్ క్వింటన్ డికాక్ (2), సునీల్ నరైన్ (5), వెంకటేశ్ అయ్యర్ (7), రింకూ సింగ్ (2), హర్షిత్ రాణా (3) అతి తక్కువ పరుగులు చేశారు. కెప్టెన్ అజింక్య రహనే 17 స్కోర్ నమోదు చేయగా.. రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా డకౌట్ అయ్యారు.
తమపై ప్రతాపం చూపిన బౌలర్లను అదే రీతిలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్రదర్శన చేశారు. ఏ బ్యాటర్‌ను కూడా పరుగులు చేయకుండా నియంత్రణ చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. యుజువేంద్ర చాహల్ 4 వికెట్లు తీసి కోల్‌కత్తాను చావుదెబ్బ తీశారు. మార్కో జెన్సన్ 3 వికెట్లతో విజృంభించగా.. బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్కొక్క వికెట్ తీశారు. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తడబడగా పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ నాలుగింట విజయం సాధించగా.. 2 మ్యాచ్‌లు కోల్పోయింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 7 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి నాలుగు మ్యాచ్‌లను కోల్పోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









