RCB vs PBKS Highlights: చిరకాల కల అయిన ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారైనా సాధించాలనే కసితో ఉంది. మొదట తడబడిన ఆ జట్టు ప్రస్తుతం నిలకడగా ఆడుతూ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ పరుగుల సునామీతో బెంగళూరుకు భారీ ఊరట లభించింది. 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకోగా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకుంది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం పొందింది.
Also Read: RR vs LSG: యశస్వి జైస్వాల్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై 2 పరుగుల తేడాతో లక్నో ఉత్కంఠ విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పరుగులు తీసేందుకు బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పవర్ ప్లే కొంత దూకుడుగా ఆడినా ఆ తర్వాత మిడిలార్డర్ దాన్ని కొనసాగించలేకపోయారు. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభుసిమ్రాన్ సింగ్ (33) కొంత స్కోర్ నమోదు చేసినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) మరోసారి బ్యాటర్‌గా విఫలమయ్యాడు. జోష్ ఇంగ్లీష్ 29 పరుగులతో పర్వాలేదనిపించగా.. నెహాల్ వదేరా 5 పరుగులకే ఔటయ్యాడు. శశాంక్ సింగ్ (31), మార్కో జేన్సన్ (25) కొంత పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. స్టోయినిస్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి పంజాబ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలా రెండు వికెట్ల చొప్పున తీయగా.. షెఫర్డ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: Jos Buttler: బ్యాట్‌తో బట్లర్ పరుగుల సునామీ.. ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం
తక్కువ స్కోర్‌ను బెంగళూరు బ్యాటర్లు ఉఫ్ అని ఊదేశారు. విరాట్ కోహ్లీ దుమ్మురేపే బ్యాటింగ్‌తో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి బెంగళూరు 159 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఫిల్ సాల్ట్ ఒక్క పరుగులకే నిష్క్రమించగా.. విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు భారీ విజయాన్ని అందించాడు. 54 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో దుమ్మురేపాడు. కోహ్లీకి చక్కటి భాగస్వామ్యం అందిస్తూ దేవదత్ పడిక్కల్ 35 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రజత్ పాటిదర్ 12 పరుగులు చేయగా.. జితేశ్ శర్మ 11 స్కోర్ చేశాడు. బ్యాటర్లు చేసిన తక్కువ స్కోర్‌ను పంజాబ్ బౌలర్లు కాపాడలేకపోయారు. బెంగళూరుపై ఏమాత్రం ప్రతాపం చూపలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, యుజువేంద్ర చాహల్ తలా ఒక్కో వికెట్ తీశారు.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఈ విజయంతో బెంగళూరు ముంందంజ వేయగా.. మూడో ఓటమితో పంజాబ్ కింగ్స్ కొంత వెనుకడుగు వేసింది. 8 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 5 విజయాలు ఖాతాలో వేసుకోగా.. మూడింట ఓడిపోయింది. 8 మ్యాచ్‌లు ఐదు నెగ్గి మూడింట ఓడిపోయి కొంత పాయింట్లు తగ్గించుకున్నా ప్లేఆఫ్స్ ఆశలు ఏమాత్రం కోల్పోలేదు. భవిష్యత్‌లో ఆడే మ్యాచ్‌ల్లో ప్రభావం బట్టి పంజాబ్, బెంగళూరు భవిష్యత్ తేలనుంది. ప్రస్తుత లెక్కలు చూస్తే ఈ రెండూ జట్లు ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









