IPL 2025 Play Offs: ఐపీఎల్ 2025 సీజన్ 18లో కీలకమైన ప్లే ఆఫ్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు వరుస పరాజయాలతో అట్టడుగున ఉన్నాయి. ఈ తరుణంలో ప్లే ఆఫ్ అవకాశాల గురించి పరిశీలిద్దాం.
ఐపీఎల్ 2025 లో దాదాపు సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కో జట్టు 5-6 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు వెనుకంజలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ముంబై ఇండియన్స్ అనూహ్యంగా పుంజుకుని ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం నాలుగు ప్లే ఆఫ్ స్థానాల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ గెలుపుతో పాటు రన్ రేట్ కూడా చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కేపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు టాప్ 4లో ఉంటే పంజాబ్ కింగ్స్ లెవెన్, లక్నో సూపర్ జెయింట్స్ , కేకేఆర్ జట్లు మిగిలిన 5, 6, 7 స్థానాల్లో ఉన్నాయి. ఇక చివరి మూడు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్‌హెచ్, సీఎస్కే జట్లు ఉన్నాయి. ఏయే జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం
గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఉంటే డిల్లీ కూడా అదే స్థాయిలో ఉంది. రన్‌రేట్ పరంగా జీటీ కాస్త ముందుంది. ఈ రెండు జట్లకు ఇంకా ఆరేసి మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో కనీసం రెండేసి మ్యాచ్‌లలో గెలిస్తే చాలు ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరడం ఖాయం.
ఇక ఆర్సీబీ కూడా 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. రన్‌రేట్ కాస్త తక్కువగా ఉంది. ఇంకా ఐదు మ్యాచ్‌లలో కచ్చితంగా రెండు గెలవాల్సి ఉంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. ఇంకా మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం మూడు గెలవాల్సి ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ పరిస్థితి మిశ్రమంగా ఉంది. లక్నో 9 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం మూడు గెలవాలి. ఇక పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో 5 గెలిచింది. ఇంకా ఆరు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిస్తే సరిపోతుంది. కేకేఆర్ జట్టు 8 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. మిగిలిన 6 మ్యాచ్‌లలో 5 కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశలు దాదాపుగా లేనట్టే. 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్ జట్టు 2 గెలిచి 4 పాయింట్లతో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టే.
ఇక ఎస్ఆర్‌హెచ్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలిచి తీరాలి. ఈ అద్భుతం జరిగితేనే ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా పోయాయి. 4 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉన్న సీఎస్కే మిగిలిన 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్ కష్టమే.
Also read: CSK vs SRH: చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. విజయంతో హైదరాబాద్ ముందడుగు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









