IPL 2025 Points Table Latest Updates: ఐపీఎల్ 2025 (IPL 2025) ట్రోఫీ కోసం అన్ని జట్లు తమ వేటను ఆరంభించాయి. ఇప్పటివరకు అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ మాత్రం ఒక మ్యాచ్ మాత్రమే ఆడింది. మరికొన్ని జట్లు మూడు మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. ఇప్పటికే అన్ని జట్లు పాయింట్ల ఖాతాను (IPL 2025 Points Table) ఓపెన్ చేశాయి. ఈసారైనా కప్ సాధించాలని పట్టుదలతో ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించి నాలుగు పాయింట్లతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. రన్‌రేట్ కూడా +2.266 అన్ని జట్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. రెండోస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ కూడా రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా.. నెట్‌రన్‌రేట్ +1.320 ఆర్‌సీబీ కంటే తక్కువగా ఉంది.
మూడోస్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండు పాయింట్లు సాధించింది. లక్నోకు రన్‌రేట్ +0.963 ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంది. గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపుతో రెండు పాయింట్లు, +0.625 రన్‌రేట్‌తో నాలుగోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స ఆడిన ఒకే మ్యాచ్‌లో విజయం సాధించి ఐదోస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండు ఓటములు, ఒక గెలుపుతో ఆరోస్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. రెండు పాయింట్లు -0.771 రన్‌రేట్‌తో ఏడోస్థానంలో కొనసాగుతుంది. మొదట మ్యాచ్‌లోనే భారీ స్కోరుతో అంచనాలు పెంచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తరువాత రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా ఓటమిపాలైంది. రెండు పాయింట్లు, -0.871 రన్‌రేట్‌తో 8వ స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఒక గెలుపు, రెండు ఓటములతో తొమ్మిదోస్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకే గెలుపుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
ఆరెంజ్ క్యాప్ రేసులో లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 145 పరుగులు చేశాడు. రెండోస్థానంలో సాయి సుదర్శన్ (137), ట్రావిస్ హెడ్ (136), మిచెల్ మార్ష్ (124), అంకిత్ వర్మ (117) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 9 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ 8 వికెట్లతో రెండోస్థానంలో, ఖలీల్ అహ్మద్ (6), శార్దుల్ ఠాకూర్ (6), కుల్దీప్ యాదవ్ (5) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Sikandar Collections:‘సికందర్’కు దెబ్బ మీద దెబ్బ.. సల్లూ భాయికు చుక్కలు కనిపిస్తున్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









