PBKS vs LSG: పంజాబ్‌ ప్లేఆఫ్స్‌లో పక్కా.. లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఆరో ఓటమి

IPL 2025 PBKS Beat LSG By 37 Runs: ప్లేఆఫ్స్‌కు దాదాపుగా పంజాబ్‌ కింగ్స్‌ చేరిపోయింది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను ధర్మశాలలో ఓడించిన పంజాబ్‌ ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంది. లక్నో మాత్రం ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 5, 2025, 12:31 AM IST
PBKS vs LSG: పంజాబ్‌ ప్లేఆఫ్స్‌లో పక్కా.. లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఆరో ఓటమి

PBKS vs LSG Highlights: ఐపీఎల్‌ 2025 సీజన్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. అద్భుతం చేస్తాయనుకున్న జట్లు ఘోర పరాభవం ఎదుర్కొంటుండగా.. ఏమాత్రం అంచనాలు లేని జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జియాంట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. భారీ స్కోర్‌ పారిన ఈ మ్యాచ్‌లో లక్నో లక్ష్యం సాధించలేక తడబడడంతో పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జియాంట్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది.

Add Zee News as a Preferred Source

Also Read: KKR vs RR: రాజస్థాన్‌ రాయల్స్‌ ఇంటికి.. ఒక్క పరుగుతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ సంచలన విజయం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రియాన్ష్‌ ఆర్య ఒక్క పరుగుకే వికెట్‌ కోల్పోగా ప్రభుషిమ్రాన్‌ సింగ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 91 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 7 సిక్స్‌లు, 6 ఫోర్లతో చెలరేగి ఆడి ప్రత్యర్థికి భారీ స్కోర్‌ ఖాయం చేశాడు. జోష్‌ ఇంగ్లీష్‌ 30 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చక్కటి బ్యాటింగ్‌తో 45 పరుగులు చేశాడు. నేహాల్‌ వదెరా 16, శశాంగ్‌ సింగ్‌ 33, స్టొయినిస్‌ 15 ఇలా జట్టుకు కావాల్సినంత స్కోర్‌ చేశారు. లక్నో సూపర్‌జియాంట్స్‌ బౌలింగ్‌లో విఫలమయ్యారు. ఆకాశ్‌ సింగ్‌, దిగ్వేష్‌ రాఠీ రెండేసి వికెట్లు తీయగా.. ప్రిన్స్‌ యాదవ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Also Read: Telangana Weather: రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. తెలంగాణ ప్రజలకు భారీ ఊరట

పంజాబ్‌ కింగ్స్‌ విధించిన భారీ లక్ష్యాన్ని లక్నో సూపర్ జియాంట్స్‌ అతికష్టంగా లక్నో సూపర్‌జియాంట్స్‌ 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. మిచెల్ మార్షల్ డకౌట్‌ కాగా.. ఐడెన్‌ మార్‌క్రమ్‌ (13) తక్కువ పరుగులు ఇచ్చాడు. నికోలస్‌ పరాన్‌ 6 పరుగులు చేయగా.. ఆయుష్‌ బదౌనీ సంచలన ప్రదర్శన చేశాడు. 50 బంతుల్లో 74 పరుగులు చేసి మరోసారి బ్యాటర్‌గా సత్తా చాటాడు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్ 18 పరుగులు చేసి అందరినీ నిరాశపరిచాడు. డేవిడ్ మిల్లర్‌ 11 పరుగులు చేయగా.. ఆవేశ్‌ ఖాన్‌ 19 పరుగులు జోడించాడు. బ్యాటర్లు నిలిపిన భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు కాపాడారు. ప్రత్యర్థిపై బంతులతో విరుచుకుపడ్డారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మార్కో జేన్స్‌ ఒక్కొక్క వికెట్‌ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News