IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ వర్షం రద్దయితే ఎవరికి లాభం, విజేత ఎవరు

IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ 18 చివరి అంకం మిగిలింది. మరి కొద్ది గంటల్లో తుది పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు సిద్దమౌతున్నాయి. విశేషం ఏంటంటే రెండు జట్లకు ఇదే తొలి టైటిల్ కానుంది. అందుకే ఆ అదృష్టం ఎవరకి వర్తిస్తుందోననేది ఆసక్తిగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2025, 06:53 PM IST
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ వర్షం రద్దయితే ఎవరికి లాభం, విజేత ఎవరు

IPL 2025 Final: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతిసారీ ఈసాలా కప్ నమ్దే అంటూనే ట్రోఫీకు దూరమైపోతోంది. గతంలో ఫైనల్‌లో ఓడి ట్రోఫీకు దూరమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అటు పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. మొత్తం కప్ కోసం రెండు జట్లు చాలా గట్టిగానే ప్రయత్నించనున్నాయి. ఈ నేపధ్యంలో వర్షం ముప్పు పొంచి ఉందనే వార్త రెండు జట్లను చికాకు పెడుతోంది. 

Add Zee News as a Preferred Source

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ 18 ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఒక్కసారైనా కప్ సాధించాలనేది రెండు జట్లకు ఉన్న ప్రధాన లక్ష్యం. అయితే జూన్ 3 రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దాంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రేపు సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆకాశం మేఘావృతంగా ఉండి 60 శాతం వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నాయి. 

జూన్ 1న జరిగిన ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ క్వాలిఫయర్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావల్సిన మ్యాచ్ కాస్తా 9.45 గంటలకు మొదలైంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం ఉంది. వర్షం వల్ల మ్యాచ్ ప్రారంభం కాకుంటే జూన్ 4 రిజర్వ్ డే ఉంది. ఆ రోజు కూడా వర్షం అడ్డంకిగా మారితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకుంటే లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అందుకే వర్షం రాకూడని ఆర్సీబీ బలంగా కోరుకుంటోంది. వర్షం అంతరాయం కల్గిస్తే ఆర్సీబీకు ఇబ్బందికర పరిణామమే.

Also read: Summer Alert: నైరుతి మందగమనం, మళ్లీ పెరిగిన ఎండలు ఉక్కపోత ఈ జిల్లాలకు వార్నింగ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News