
KKR vs RCB: ఈసారి ఐపీఎల్ చాలా విభిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చి చేరాయి. కొత్త కెప్టెన్లు వచ్చారు. అన్ని ఫ్రాంచైజీల్లో ఆటగాళ్లు మారిపోయారు. ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్‌తో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ జరగనుంది. ఇవాళ జరిగే మొదటి మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా లేనట్టు కన్పిస్తోంది.
ఐపీఎల్ తొలి మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం కానుంది. ఆర్సీబీ అయితే పక్కా ప్లేయింగ్ 11 తో బరిలో దిగుతోంది. గత సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేత విరాట్ కోహ్లిపై ఆర్సీబీ భారీ అంచనాలతో ఉంది. అటు కేకేఆర్ కూడా విజయంతో బోణీ కొట్టేందుకు యోచిస్తోంది. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం మరోలా ఉంది. తొలి మ్యాచ్ జరిగే పరిస్థితి కన్పించడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాత్రి 7.30 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పశ్చిమ బెంగాల్లో రెండ్రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా కోల్‌కతాలో 90 శాతం వర్ష సూచనలు ఉన్నాయి. దీనికితోడు వడగండ్ల వాన పడవచ్చనే అంచనాలున్నాయి. మద్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే సాయంత్రం 6 గంటల తరువాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యువెదర్ అంచనా వేస్తోంది. సాయంత్రం 7 గంటల తరువాత వర్షాలు పడే అవకాశం 10 శాతం ఉందని తెలుస్తోంది. శుక్రవారం అంటే మార్చ్ 21న కూడా వర్షం పడటంతో గ్రౌండ్ అంతటినీ కవర్లతో కప్పి ఉంచారు. ఎప్పటికప్పుడు నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే
ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఆప్షన్ ఉండదు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే నిర్ణీత సమయం కంటే గంట అదనంగా కేటాయిస్తారు. జట్టు ఫలితం తేల్చాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కటాఫ్ టైమ్ రాత్రి 10.56 గంటలు కాగా అర్ధరాత్రి 12.06 గంటలకు ముగించాల్సి ఉంటుంది. మ్యాచ్ ఎంత ఆలస్యమైతే అంతగా ఓవర్ల తగ్గింపు ఉంటుంది. అప్పటికీ ఫలితం తేలకుంటే మాత్రం చెరో పాయింట్ ఇచ్చేస్తారు.
ఐపీఎల్ 2025 సీజన్ 18 మ్యాచ్‌లు అన్నీ జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. అటు స్టార్ స్పోర్ట్స్‌లో కూడా ప్రసారం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. రెండు జట్ల మధ్య బలాబలాలు పరిశీలిస్తే కేకేఆర్ పైచేయిలో ఉంది.
ఆర్సీబీ ప్లేయింగ్ 11
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్ వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ లేదా రసిఖ్ దార్ సలామ్
కేకేఆర్ ప్లేయంగ్ 11
సునీల్ నరైన్, క్వింటన్ డీకాక్, అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, ఆంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి