IPL 2025 KKR vs SRH: ఐపీఎల్ 2025 కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఇదే

IPL 2025 KKR vs SRH: ఐపీఎల్ 2025 సీజన్ 18 కీలకమైన మ్యాచ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 ఫైనలిస్టులు తలపడుతున్న మ్యాచ్ ఇది. రెండు జట్లకూ గెలుపు తప్పక లభించాల్సిన మ్యాచ్ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2025, 03:31 PM IST
IPL 2025 KKR vs SRH: ఐపీఎల్ 2025 కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఇదే

IPL 2025 KKR vs SRH: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరి కాస్సేపట్లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరగనుంది. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న రెండు జట్లు టాప్ ఆర్డర్‌పైనే భారం వేస్తున్నాయి. మూడేసి మ్యాచ్‌లు ఆడినా రెండే పాయింట్లు సాధించడంతో ఇవాళ్టి మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితిగా మారింది. ఇవాళ జరిగే మ్యాచ్ లో విజయం రెండు జట్లకు తప్పనిసరిగా మారింది. 

Add Zee News as a Preferred Source

బలమైన బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలింగ్ ఉన్నా సమిష్టిగా రాణించలేకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద మైనస్ అయింది. ఇక కేకేఆర్ జట్టులో కూడా అదే పరిస్థితి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన జట్టు ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల ఆడి ఒకే మ్యాచ్ విజయంతో రెండు పాయింట్లతో అట్టడుగున ఉంది. ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు మూడు సార్లు టైటిల్ గెల్చుకుంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయిన కేకేఆర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కసరత్తు చేస్తోంది. ఎస్ఆర్‌హెచ్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్‌తో బైటింగ్ లైనప్ భయంకరంగా ఉంది. అటు బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ , జంపా ప్రధాన ప్రధానంగా ఉన్నారు. 

స్పిన్ విభాగమే బలంగా కేకేఆర్ బరిలో దిగుతోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక డికాక్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్‌లు తమ స్థాయి ప్రదర్శన ఇంకా చూపించలేదు. 

కేకేఆర్ ప్లేయింగ్ 11 అంచనా

క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అండ్రీ రస్సెల్, రమణ దీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా

ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 అంచనా

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ

ఇంపాక్ట్ ప్లేయర్ వియాన్ ముల్డర్ లేదా ఆడం జంపా

Also read: Tatkal Tickets: తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు, కొత్తగా ఏఐ టెక్నాలజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News