IPL 2025 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18 ప్రారంభమైంది. మార్చ్ 22న ప్రారంభమైన టోర్నీ మే 25 వరకు జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్న టోర్నీలో మొదటి లీగ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరుగగా, చివరి లీగ్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది.
ఈసారి ఐపీఎల్ 2025 సీజన్ 18 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో జరగనున్నాయి. ఐపీఎల్ టైటిల్‌ను ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 5 సార్లు గెలవగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడు సార్లు గెల్చింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి టైటిల్ సాధించగా పాత ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ ఒకసారి గెలిచింది. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లు జరగగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. రెండో స్థానంలో ఆర్సీబీ నిలిచింది. ఎస్ఆర్‌హెచ్ మరోసారి భారీ స్కోర్ సాధించడంతో రన్‌రేట్ పరంగా టాప్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
టీమ్ మ్యాచ్‌లు విజయం ఓటమి పాయింట్లు రన్ రేట్
SRH 1 1 0 2 2.200
RCB 1 1 0 2 2.137
CSK 1 1 0 2 0.493
DC 1 1 0 2 -0.371
LSG 1 0 1 0 -0.371
MI 1 0 1 0 -0.493
KKR 1 0 1 0 -2.137
RR 1 0 1 0 -2.200
Also read: AP TG Weather Updates: ఏపీ తెలంగాణల్లో భారీ ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరిక, అక్కడ వర్షాలు<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









