Shreyas Iyer Record: ఏకైక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయర్ అయ్యర్ అరుదైన రికార్డు

Shreyas Iyer Record: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్ తరువాత అంతా పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కంటే ఆ జట్టు కెప్టెన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2025, 10:49 AM IST
Shreyas Iyer Record: ఏకైక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయర్ అయ్యర్ అరుదైన రికార్డు

Shreyas Iyer Record: ఐపీఎల్ 2025 సీజన్ 18 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించి పంజాబ్ కింగ్స్ లెవెన్ ఫైనల్‌కు చేరింది. జూన్ 3వ తేదీన ఫైనల్‌లో ఆర్సీబీతో ఆ జట్టు తలపడనుంది. విశేషమేంటంటే రెండు జట్లు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఇదే తొలిసారి అవుతుంది. 

Add Zee News as a Preferred Source

పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టును ఫైనల్‌కు చేర్చడంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా మూడూ వేర్వేరు జట్లను ఐపీఎల్ టోర్నీ ఫైనల్‌కు చేర్చిన చరిత్ర నెలకొల్పాడు శ్రేయస్ అయ్యర్. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రస్తుత ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడై 2020 ఐపీఎల్‌లో జట్టుని ఫైనల్‌కు చేర్చాడు. అప్పుడు క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఓడించి ఫైనల్‌కు చేరింది. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు అదే ముంబై ఇండియన్స్ జట్టుని క్వాలిఫయర్ 2లో ఓడించి ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు. 

2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్‌లో టేబుల్ టాప్‌గా నిలిచి ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టుకు మూడవ టైటిల్ అందించాడు. ఆ సీజన్‌లో కేకేఆర్ జట్టు 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. 

ఇక ఈ సీజన్ 2025లో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు శ్రేయస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ జట్టు 2014 తరువాత తొలిసారిగా ప్లే ఆఫ్ అర్హత సాధించింది. అంతేకాకుండా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. నిన్న జూన్ 1వ తేదీన జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి అరుదైన చరిత్ర సృష్టించాడు. సమర్ధవంతమైన నాయకత్వం, సరైన నిర్ణయాలు, బ్యాటింగ్ స్టెబిలిటీ అతని విజయానికి కారణాలుగా ఉన్నాయి. 

Also read: Coronavirus Threat: పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, వేలాదిగా కొత్త కేసులు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News