IPL 2025 KKR vs RCB: ఎలాంటి అంతరాయం లేకుండా ఐపీఎల్ 2025 సీజన్ 18 మొదటి మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను ఆ జట్టు సొంత పిచ్‌పై ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీజన్ 18లో శుభారంభం చేసి టైటిల్ ఫేవరైట్ బరిలో నిలుస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ 18 తొలి మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా, వర్షం కారణంగా ఆగిపోతుందనే అంచనాలు 90 శాతం ఉన్నాయి. అలాంటిది వరుణుడు కరుణించడంతో మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కేకేఆర్ భారీ లక్ష్యమే విధించింది. అజింక్యా రహానే విరుచుకుపడి 31 బంతుల్లో 56 పరుగులు చేయడం, సునీల్ నరైన్ 44 పరుగులు, రఘువంశీ 30 పరుగుల చేయడంతో 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ఓ దశలో 200 స్కోర్ దాటుతుందని అనుకున్నారు. కానీ చివర్లో ఆర్సీబీ బౌలర్లు రాణించడంతో భారీ స్కోర్ కాకుండా నిలువరించగలిగారు.
175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ ప్రారంభం నుంచి కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ పవర్ ప్లేలోనే 80 పరుగులు చేసిన జట్టును విజయం దిశగా పరుగులు తీయించారు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ కోహ్లి 59 పరుగులతో నాట్ అవుట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ కాగా లివింగ్ స్టోన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తానికి కేకేఆర్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం చేసింది ఆర్సీబీ.
Also read: IPL 2025 Open Ceremony: అత్యంత వైభవంగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్, తొలి మ్యాచ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









