IPL 2025 SRH Team: ఐపీఎల్ 2025 సీజన్ 18 మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలలు సాగే ఈ మెగా టోర్నీలో సమూల మార్పులతో 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. మెగా వేలం జరగడంతో ఈసారి అన్ని జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధరకు క్రీడాకారులు అమ్ముడుపోయారు.
ఐపీఎఎల్ 2024 సీజన్ 17లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అలియాస్ ఆరెంజ్ ఆర్మీ..కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. టైటిల్ అవకాశాన్ని కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచినా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎందుకంటే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లను నమోదు చేసింది. ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకునేందుకు భారీ మార్పులు చేర్పులతో బరిలో దిగుతోంది. కెప్టెన్ పాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా జట్టులో చేరడంతో ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరింత బలం చేకూరింది. ఎందుకంటే ఈ ఇద్దరూ గాయాల కారణంగా ఎప్పుడు జట్టులో చేరతారో అనే అనుమానం ఉండింది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి మధ్యలోనే తప్పుకున్నాడు. ఐపీఎల్ 2025లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతాడని జట్టు యాజమాన్యం తొలుత ప్రకటించింది.
అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు, బీసీసీఐ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఐపీఎల్ 2025 ప్రారంభం నుంచే నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటాడు. గత సీజన్‌లో నితీష్ కుమార్ రెడ్డి 13 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో నితీష్ రెడ్డి కోసం కావ్య పాప ఆరు కోట్లు ఖర్చు పెట్టి రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ మార్చ్ 23న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉంది.
ఈసారి కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్‌లపై భారీ అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లో మొహమ్మద్ షమి, ఆడమ్ జంపా రావడంతో మరింత పటిష్టమైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా
ట్రావిస్ హెడ్, అబిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మొహమ్మద్ షమి, ఆడం జంపా
Also read: Amaravati ORR Railway Line: అమరావతి చుట్టూ భారీ ప్రణాళిక, ఓఆర్ఆర్ వెంబడి కొత్తగా రైల్వే లైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









