IPL 2025: ఐపీఎల్ 2025లో అత్యధికంగా టైటిల్ గెల్చిన జట్లు ఈసారి చతికిలపడుతున్నాయి. భీకరమైన బ్యాటింగ్ లైనప్‌తో రికార్డులు సృష్టించిన జట్టుకు దిష్టి గట్టిగా తగిలినట్టు కన్పిస్తోంది. ఐపీఎల్‌లో మేటి జట్లేవీ ఈసారి టాప్ 4లో లేకపోవడం విశేషం. తక్కువ అంచనా వేసిన జట్లు టాప్‌లో దూసుకుపోతున్నాయి.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ చెరో ఐదు సార్లు టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు పూర్తిగా కష్టకాలం దాపురించింది. చెన్నై సూపర్‌కింగ్స్ ప్రారంభ మ్యాచ్ ఒక్కటే గెలిచింది. ఆ తరువాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. దోనీ నామస్మరణ తప్ప మరేదీ కన్పించడం లేదు. ఇక ముంబై ఇండియన్స్ అయితే బౌలింగ్ చాలా బలహీనంగా కన్పిస్తోది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు రాణించలేకపోతున్నారు. సూర్య , నమన్ ధిర్ తప్ప మరెవరూ పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నారు. రోహిత్ శర్మ అయితే నాలుగో మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితమయ్యాడు. భారీ హిట్టర్లు కలిగి ఉండటమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో టాప్ 3 స్కోర్లు సాధించిన జట్టు మొదటి మ్యాచ్ ఒక్కటే గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఇంకా ట్రాక్‌లో పడలేదు. ఓవరాల్‌గా చూస్తే సీఎస్కే, ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి.
ఇక అక్షర్ పటేల్ కొత్త కెప్టెన్ సారధ్యంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు నాలుగింటి మూడు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ టైటాన్స్ కూడా నాలుగింటి మూడు గెలిచి రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో మూడింటి రెండు గెలిచి నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో బలంగా ఉంది. భువనేశ్వర్, హేజిల్ వుడ్, యశ్ దయాళ్‌తో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మధ్యలో కొనసాగుతున్నాయి. అట్టడుగున ఉన్న చెన్నై, ముంబై, హైదరాబాద్ జట్ల కంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. అందుకే ఈసారి ఐపీఎల్ మాత్రం ఓడలు బండ్లు బండ్లు ఓడలనే సామెతను నిజం చేస్తోంది.
Also read: Mamata Banerjee: సుప్రీంకోర్టు ఆదేశాలను మమతా బెనర్జీ ధిక్కరిస్తున్నారా, ఏం జరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









