KKR New Captain: ఐపీఎల్ 2024 టైటిల్ విజేతగా నిలిచిన తరువాత మెగా ఆక్షన్ కంటే ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విడుదల చేసి కేకేఆర్ సంచలనం రేపింది. ఆ తరువాత వేలంలో కావల్సిన ఆటగాళ్లను తీసుకుంది. అయితే కెప్టెన్ ఎవరనేది మాత్రం మొన్నటి వరకూ సందిగ్ధంగానే ఉంది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ తొలగించింది కేకేఆర్ యాజమాన్యం.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తరువాత అత్యధిక సార్లు టైటిల్ గెల్చిన జట్టు కేకేఆర్. ఈ జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. మెగా ఆక్షన్ తరువాత కూడా ఈ జట్టుకు కెప్టెన్ ఎవరనేది నిర్ణయం కాలేదు. ఇప్పుడు కేకేఆర్ యాజమాన్యం జట్టు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరినీ ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కొత్త కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇక వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను ఎంచుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ 18లో కేకేఆర్‌కు
ఇప్పుడు అజింక్యా రహానే సారధ్యం వహించనున్నారు. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మద్య మార్చ్ 22న జరగనుంది.
అజింక్యా రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇతడి కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 24 మ్యాచ్‌లు ఆడగా 9 గెలిచింది. 15 మ్యాచ్‌లు ఓడిపోయింది. అజింక్యా రహానే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు 9వ కెప్టెన్. ఇతని కంటే ముందు సౌరవ్ గంగూలీ, బ్రేడన్ మ్యాక్యులమ్, గౌతమ్ గంభీర్, జాక్ కల్లిస్, దినేష్ కార్తీక్, ఇయోన్ మోర్గాన్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణాలు కెప్టెన్లుగా పనిచేశారు. కేకేఆర్ జట్టు 2012లో మొదటి సారి టైటిల్ గెలవగా 2014లో రెండోసారి విజేతగా నిలిచింది. ఇక 2024లో మూడోసారి టైటిల్ గెల్చుకుంది.
కేకేఆర్ కెప్టెన్ రికార్డులు
సౌరవ్ గంగూలీ 27 మ్యాచ్‌లు - 13 విజయం 14 ఓటమి
బ్రేడన్ మ్యాక్యులమ్ 13 మ్యాచ్‌లు-3 విజయం 9 ఓటమి
గౌతమ్ గంభీర్ 122 మ్యాచ్‌లు-69 విజయం, 51 ఓటమి
జాక్ కల్లిస్ 2 మ్యాచ్‌లు-1 విజయం, 1 ఓటమి
దినేష్ కార్తీక్ 37 మ్యాచ్‌లు-19 విజయం 17 ఓటమి
ఇయోన్ మోర్గాన్ 24 మ్యాచ్‌లు-11 విజయం 12 ఓటమి
శ్రేయస్ అయ్యర్ 29 మ్యాచ్‌లు-17 విజయం, 11 ఓటమి
నితీష్ రాణా 14 మ్యాచ్‌లు-6 విజయం, 8 ఓటమి
Also read: AP WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, మరో 150 వాట్సప్ సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









