)
IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించిన ముంబై ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఇవాళ గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 ఇవాళ సాయంత్ర 7.30 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఒకవేళ వర్షం కారణంగా క్వాలిఫయర్ 2 రద్దయితే ఏ జట్టు ఫైనల్ చేరుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సీజన్లో వర్షాల కారణంగా చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. వాస్తవానికి క్వాలిఫయర్ 2కు రిజర్వ్ డే ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రేపు రిజర్వ్ డే నాడు జరగనుంది. రిజర్వ్ డే మ్యాచ్ కూడా రద్దయితే పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్లు కలిగిన జట్టు ఫైనల్ చేరుతుంది. అంటే పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు ప్రయోజనం పొందనుంది. ఎందుకంటే లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తరువాత 19 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ లెవెన్ టాప్ 1లో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ లెవెన్ ఫైనల్ చేరి ఆర్సీబీతో తలపడనుంది.
అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, వాతావరణ నివేదిక ప్రకారం ఇవాళ్టి మ్యాచ్‌కు వర్షం ఆటంకం లేదనే చెప్పాలి. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం కురిసినా అక్కడితే ఆపి మళ్లీ ప్రారంభిస్తారు. వర్షం అదే పనిగా కొనసాగితే మాత్రం రద్దు కాక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook