IPL 2025: అభిషేక్ శర్మ మోత..బౌలర్లకు ఊచకోత..శతక్కొట్టేశాడుగా భయ్యా

IPL 2025: పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ శతక్కొట్టాడు. పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్ ఆడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి చుక్కలు చూపించాడు. 6 సెక్సులు, 11 ఫోర్లతో ఫ్యాన్స్ కేరింతలు రెట్టింపు చేశాడు.చాహల్ బౌలింగ్ లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీ సాధించాడు.   

Written by - Bhoomi | Last Updated : Apr 12, 2025, 11:24 PM IST
IPL 2025: అభిషేక్ శర్మ  మోత..బౌలర్లకు ఊచకోత..శతక్కొట్టేశాడుగా భయ్యా

IPL 2025:  భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తున్న అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. బౌండరీలతో చెలరేగిపోయాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. శశాంక్ సింగ్ బౌలింగ్ 2 ఫోర్లు బాది 98కు చేరువయ్యాడు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్ లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 100 పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇషాన్ కిషన్, ప్రియాన్ష్ ఆర్య తర్వాత ఈ సీజన్ లో మూడో శతకం బాదిన క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు ఇదే ఓవరులో సిక్సర్ బాదిన ట్రావిస్ హెడ్ మ్యాక్స్ వెల్ చేతికి క్యాచ్ ఇఛ్చి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో 171 వద్ద సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెస్ క్రీజ్ లో ఉన్నాడు. 13 ఓవర్లకు స్కోర్ 175-1గా ఉంది. ఇక విజయం సాధించాలంటే ఇంకో 70కి పైగా పరుగులు సాధించాల్సి ఉంది. 

Add Zee News as a Preferred Source

 

 

కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..అనుకున్నట్లుగానే భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్, నేహాల్ వధేరా రఫ్పాడించారు. జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 245 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయం సాధించాలంటే 246 పరుగులు చేయాలి. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4నాలుగు వికెట్లు ఎషాన్ మలింగ 2 వికెట్లు తీశారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News