IPL 2025 SRH vs DC: ఐపీఎల్ 2025 సీజన్ 18 ఘనంగా ప్రారంభమైంది. భీకరమైన బ్యాటర్లతో బలంగా కన్పిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌పై అంచనాలకు అనుగుణంగానే ఆడింది. అయితే రెండవ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పొందడంతో అలర్ట్ అయినట్టు కన్పిస్తోంది. అందుకే ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌కు ముందు కీలక మార్పులు చేస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ 18 లో రేపు అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్, విశాఖపట్నం వేదికలపై ఒక్కో మ్యాచ్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు రేపు మార్చ్ 30 విశాఖపట్నంలో తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల చేసిన ఆరెంజ్ ఆర్మీ లక్నో మ్యాచ్‌లో తడబడినా 190 పరుగులు చేయగలిగింది. కానీ బౌలర్లు ఘోరంగా విఫలం కావడం, లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ విజృంభించడంతో ఓటమి పాలైంది. అందుకే ఇప్పుడు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది.
విశాఖలో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగులు భారీగానే వచ్చాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కన్పించింది. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. స్పిన్ ప్రభావం ఉండటంతో ఆ విభాగాన్ని పటిష్టం చేయనుంది. అందుకే జంపాకు తోడుగా సిమర్జిత్ సింగ్ స్థానంలో రాహుల్ చాహర్‌ను రంగంలో దించవచ్చు. ఆడమ్ జంపాను తప్పిస్తే కామిందు మెండీస్‌ను ఆడించవచ్చు. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైన అబినవ్ మనోహర్‌ను తప్పించి సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌ను ఆడించవచ్చు. ఆరెంజ్ ఆర్మీ నుంచి ట్రావిస్ హెడ్ భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. అభిషేక్ శర్మ రాణించాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఫామ్ కొనసాగించాలి. బౌలింగ్ విభాగం పటిష్టంగానే కన్పిస్తున్నా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ లేదా సచిన్ బేబి లేదా అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ లేదా రాహుల్ చాహర్, మొహమ్మద్ షమి
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జంపా లేదా కమిందు మెండిస్ వ్యవహరిస్తారు.
Also read: Schools Holidays: తెలంగాణలో స్కూల్స్‌కు వరుసగా 5 రోజులు సెలవులు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









