SRH vs HCA Dispute: ముగిసిన SRH వర్సెస్ HCA టికెట్ల పంచాయితీ, ఏపీ ఆశలకు బ్రేక్

SRH vs HCA Dispute: చిలికి చిలికి గాలివానగా మారిన వివాదం సద్దుమణిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కడికీ తరలిపోకుండా సమస్య పరిష్కారమైంది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2025, 09:54 PM IST
SRH vs HCA Dispute: ముగిసిన SRH వర్సెస్ HCA టికెట్ల పంచాయితీ, ఏపీ ఆశలకు బ్రేక్

SRH vs HCA Dispute: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య చెలరేగిన వివాదం ఎట్టకేలకు క్లియర్ అయింది. ఇరువర్గాల ప్రతినిధుల మధ్య భేటీలో సమస్య పరిష్కారమైంది. అసలేం జరిగిందంటే

Add Zee News as a Preferred Source

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెలరేగిన టికెట్ల వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్‌సీ‌ఏ బెదిరిస్తోందని..ఇలా చేస్తే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదే అదనుగా ఎస్ఆర్‌హెచ్ జట్టును ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ వివాదానికి ఇప్పుడు శుభం కార్డు పడింది. ఇవాళ హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్, బీసీసీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ముగ్గురి మధ్య జరిగి త్రై పాక్షిక ఒప్పందం మేరకు నడుచుకునేందుకు అటు ఎస్ఆర్‌హెచ్ ఇటు హెచ్‌సీఏ ప్రతినిధులు అంగీకరించారు. దాంతో ఇకపై ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్ దేవరాజ్ నేతృత్వంలో చర్చలు జరగగా ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్‌లు ఒప్పందాన్ని ఖరారు చేశారు. 

ఈ త్రై పాక్షిక ఒప్పందం ప్రకారం స్డేడియంలోని అన్ని కేటగిరీల్లో 10 శాతం టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. చాలా కాలంగా ఆచరిస్తూ వస్తున్నట్టే ప్రతి కేటగరీలో పాస్ విధానం కొనసాగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. ఎస్ఆర్‌హెచ్ సీఈవో షణ్ముగంతో ఫోన్ సంప్రదింపుల తరువాత 3900 కేటగరీ కాంప్లిమెంటరీ పాస్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని తేలింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో ప్రొఫెషనల్‌గా పూర్తిగా సహకారం అందించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంగీకారం తెలిపింది. గతంలో నెలకున్న వివాదాలు ఇక ముగిసినట్టేనని హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ సంయుక్తంగా ప్రకటించాయి

Also read: Hardik vs Jasmin: ఆ ఇద్దరి ఎఫైర్ నిజమే, ముంబై ఇండియన్స్ బస్సులో హల్‌చల్ చేసిన జాస్మిన్ వాలియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News