
IPL 2025 SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 టోర్నమెంట్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో ప్రారంభించింది. తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును బోల్తా కొట్టించిన ఆరెంజ్ ఆర్మీ బోణీ చేసింది. ఐపీఎల్ లో రెండో అతి పెద్ద స్కోర్ నమోదు చేసి హైదరాబాద్ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో 44 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ విజయానికి ఇషాన్ కిషన్ అతిపెద్ద హీరోగా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేవలం 47 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 6 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టి రప్ఫాడించేశాడు. దుమ్మురేపే ఇన్నింగ్స్ తో హైదరాబాద్ జట్టు 287 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 242 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. సంజు సామ్ సన్, ధ్రువ్ జురెల్ తీవ్రంగా శ్రమించినా విజయ తీరాలకు చేరలేదు. ఐపీఎల్ 2025 రెండో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విఫలమవగా.. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ విజయవంతమయ్యాడు. తొలి ఓవర్ నుంచి రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే 287 పరుగులు సాధించాల్సి ఉంది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 45 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి బాల్ వరకు ఆడిన ఇషాన్ కిషన్ (106) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రావిస్ హెడ్(67) మెరుపు వేగంతో ఆడాడు. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మోస్తరు పరుగులు సాధించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హక్ ఫరూఖీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి