)
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విశాఖపట్టణం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి పాయింట్ల పట్టికలో తనను తాను మెరుగుపర్చుకుంది. అతి తక్కువ పరుగులకు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను సమష్టి కృషితో పైచేయి సాధించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఢిల్లఈ ఘన విజయం పొందింది. యువ సంచలనం అనికెట్ వర్మ పోరాటం వృథాగా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లకు 163 పరుగులు మాత్రమే చేసి చాప చుట్టేసింది. భారీ పరుగులు చేసి ఢిల్లీకి సవాల్ విసురుతుందని భావిస్తే రెండో సారి కూడా తీవ్ర నిరాశకు గురయ్యింది. అభిషేక్ శర్మ (1), ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0) టాపార్డర్ మొత్తం కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (22) అతి తక్కువ స్కోర్ చేయగా.. క్లాసెన్ 32 పరుగులు చేశాడు. కష్టాల్లో ఉన్న సమయంలో అనికేట్ వర్మ సంచలన ప్రదర్శన చేశాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు పరువు నిలిపాడు. 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడాడు.
పకడ్బందీ బౌలింగ్
భారీ స్కోర్ చేయాలనుకున్న సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఢిల్లీ బౌలర్లు కుప్పకూల్చారు. మొదటి ఓవర్ నుంచి బౌలర్లు పకడ్బందీ బౌలింగ్ వేసి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేసింది. మిచెల్ స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. 3.4 ఓవర్లు మాత్రమే వేసి ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. కుల్దీప్ యాదవ్ మరోసారి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.
సన్‌రైజర్స్ బౌలర్లు విఫలం
సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చాలా సులువుగా ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి 16 ఓవర్లలోనే ఆటను ఢిల్లీ ముగించింది. టాపార్డర్ మొత్తం మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఫాఫ్ డుప్లెసిస్ (50) అర్థ శతకం చేయగా.. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ 38, అభిషేక్ పరేల్ 34, కేఎల్ రాహుల్ 15 పరుగులు చేశారు. త్రిస్టన్ స్టబ్స్ 8 పరుగులు చేశాడు. బ్యాటర్లు విధించిన సాధారణ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏ దిశలో కూడా ఢిల్లీ బ్యాటర్లను నియంత్రించలేకపోయారు. బౌలర్లు అందరూ విఫలమైన వేళ అరంగేట్ర మ్యాచ్‌లోనే యువ బౌలర్ జీషాన్ అన్సారీ కీలకమైన మూడు వికెట్లు తీశాడు. కానీ అతడికి మిగతా బౌలర్లు తోడు రాకపోవడంతో జీషాన్ శ్రమ వృథాగా మారింది.
సన్‌రైజర్స్‌కు ఏమైంది?
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపీఎల్‌లోనే రెండో అతి పెద్ద స్కోర్ నమోదు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత జరిగిన లక్నో, ఢిల్లీ మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు అన్నింట్లోనూ లోపాలు ఉన్నాయి. బ్యాటర్లు వరుసగా విఫలమవుతుండగా వారి బాటలోనే బౌలర్లు ఉంటున్నారు. ఇక ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా కదలడం లేదు. జట్టులో ఏం జరుగుతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe