RCB vs RR: బ్యాట్‌తో విరాట్ కోహ్లీ వీర విహారం.. రాజస్థాన్‌పై బెంగళూరుకు భారీ విజయం

Royal Challengers Bengaluru Beat Rajasthan Royals By 9 Wickets: ఎన్నాళ్లకు కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్‌ చూసి.. ఎన్నాళ్లకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అత్యంత సులువుగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ ఆద్యంతం ఆకట్టుకోగా బెంగళూరు అదరగొట్టింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 13, 2025, 07:21 PM IST
RCB vs RR: బ్యాట్‌తో విరాట్ కోహ్లీ వీర విహారం.. రాజస్థాన్‌పై బెంగళూరుకు భారీ విజయం

RR vs RCB Highlights: ఐపీఎల్‌లో ఇప్పుడు మంచి జోరందుకున్నట్టు కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌ ప్రేక్షకులకు మంచి వినోదం అందించగా.. అలాంటిదే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా చేసింది. ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై బెంగళూరు సంచలన ప్రదర్శన చేసింది. స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ నుంచి భారీ ప్రదర్శన రాగా.. అతడికి సాల్ట్‌ జతయ్యాడు. దీంతో సాధారణ లక్ష్యాన్ని సులువుగా బెంగళూరు చేధించింది.

Add Zee News as a Preferred Source

Also Read: LSG vs GT: గుజరాత్‌కు విజయాలకు లక్నో బ్రేక్‌.. 6 వికెట్లతో పంత్‌ సేన హ్యాట్రిక్‌ విజయం

ఆర్‌సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా రాజస్థాన్‌ రాయల్స్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులకు పరిమితమైంది. మరోసారి యువ క్రికెటర్‌ యశస్వీ జైస్వాల్‌ బ్యాట్‌తో చెలరేగి ఆడాు. 47 బంతుల్లో 75 పరుగులు చేయగా.. 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ (15) మరోసారి తక్కువ స్కోర్‌కు పరిమితమవగా.. రియాన్‌ పరాగ్‌ (30), ధృవ్‌ జురేల్‌ (35*) పర్వాలేదనిపించగా హెట్‌ మెయిర్‌ 9, నితీశ్‌ రానా 4* పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ను పరుగులు తీయకుండా చక్కగా బెంగళూరు బౌలర్లు బౌలింగ్‌ చేశారు. నాలుగు వికెట్లు మాత్రమే తీసినా స్కోర్‌ను మాత్రం బాగా నియంత్రించారు. భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హేజిల్‌వుడ, కృనాల్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు.

Also Read: MS Dhoni Retirement: ఈ ఐపీఎల్‌ చివరిది కానుందా.. కొన్ని రోజుల్లో ధోనీ రిటైర్‌మెంట్‌?

సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు బ్యాటర్లు సునాయాసంగా సాధించారు. గతంలో అంతగా ప్రదర్శన చేయని ఫిల్‌ సాల్ట్‌ విరాట్‌ కోహ్లీ ఇద్దరూ చెలరేగి ఆడారు. తక్కువ స్కోర్‌ను సాల్ట్‌తో కలిసి పూర్తి చేద్దామనుకుంటే అనూహ్యంగా అతడు ఔటయ్యాడు. అనంతరం దేవ్‌దత్‌ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ మ్యాచ్‌ను చక్కదిద్ది 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. విరాట్‌ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్‌ 33 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. దేవ్‌దత్‌ 28 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తా చాటాడు. ముగ్గురే మ్యాచ్‌ను ముగించడంతో 9 వికెట్ల తేడాతో బెంగళూరు భారీ విజయాన్ని అందుకుంది. బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం సాధించగా.. రెండింట ఓడిపోయింది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి మిగిలిన నాలుగు మ్యాచ్‌లను కోల్పోయింది. ఇంకా ఈ రెండు జట్లు 8 చొప్పున మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News