IPL 2025 Winner RCB: ఇప్పటివరకూ చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలో అయిదు కప్పులు గెలిచాయి. ప్యాన్ బేస్‌లో వారితో ఏమాత్రం తీసిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం గత సీజన్ వరకు ఒక్కటంటే ఒక్క ట్రోఫీని సాధించకపోయింది. మూడేళ్ల ముందు ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ సైతం కప్పు కొట్టినా.. ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవలేక పోయింది. మూడుసార్లు ఫైనల్ చేరింది. కానీ కప్పును మాత్రం అందుకోలేకపోయింది. విరాట్ ఆటగాడిగా, కెప్టెన్‌గా కప్పు కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు. కానీ ప్రతిసారీ నిరాశే మిగిలింది. కానీ ఈ సారి ఆ కల నెరవేరింది.
కోహ్లితో పాటు ద్రవిడ్, కుంబ్లే, యువరాజ్ సింగ్, గేల్, డివిలియర్స్, వాట్సన్.. ఇలా ఎందరో మహా మహా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ. వీరికి మరెంతోమంది స్టార్లు తోడైనా ఆ జట్టు కప్పు సాధించలేకపోయింది. కోహ్లి, గేల్, డివిలియర్స్ కలిసి ఆడినపుడు ఆ జట్టుకు తిరుగులేదనిపించేది. కానీ ముగ్గురూ ఎంత గొప్పగా ఆడినా.. కీలక మ్యాచ్‌ల్లో బౌలింగ్ వైఫల్యం వల్లో ఆ జట్టు ట్రోఫీకి దూరమయ్యేది. కోహ్లి సహా కొందరు స్టార్ల మీద అతిగా ఆధారపడడం కూడా జట్టుకు చేటు చేసేది. కానీ ఈసారి ఆర్సీబీ ఆటలో స్పష్టమైన మార్పు కనిపించింది.
కానీ ఈసారి అలాంటి తడబాటు కనిపించలేదు. ఇక ఆర్సీబీలో కనిపించిన అతి పెద్ద మార్పు.. బౌలింగ్‌లో నిలకడ. ఎంత స్కోరు చేసినా కాపాడుకోలేకపోయే బలహీనత ఈసారి కనిపించలేదు. హేజిల్‌వుడ్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించి జట్టుకు అతి పెద్ద బలంగా మారాడు. అతను ప్రతి మ్యాచ్‌లో కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టుకు భరోసానిచ్చాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ల్లోనూ అతను గెలిపించాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్ అతడికి చక్కటి సహకారం అందించారు. స్పిన్నర్ కృనాల్ పాండ్య ఫైనల్ సహా కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అలా ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చి ఛాంపియన్‌గా నిలిచింది.
విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలోనే వన్డే ప్రపంచకప్ సాధించాడు. రీసెంట్ గా టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. 2013లో, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలూ గెలిచాడు. ఇక సిరీస్ విజయాలైతే ఎన్నెన్నో. కోహ్లికి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఎండమావిగా మిగింది. నిన్నా మొన్న వచ్చిన జూనియర్ ఆటగాళ్లు కూడా కప్పు సంబరంలో భాగమవుతుంటే విరాట్ మాత్రం.. ప్రతిసారీ పరాజితుడిగా మిగులుపోతుండేవాడు. అభిమానులు సైతం బాధ పడ్డారు. అయినా నిరాశ చెందిన కోహ్లీ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో మాత్రం కప్పు సాధించలేకపోవడం విరాట్ కెరీర్లో పెద్ద లోటుగా ఉండేది. కెరీర్ ఎండింగ్‌లో ఉండడంతో ఇక ఆ కల ఎట్టకేలకు నెరవేరింది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అభిమానులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆనందంతో డ్యాన్సులు చేస్తూ, క్రాకర్స్ కాల్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడ విశాఖల్లోనూ ఆర్సీబీ అభిమానులు కోలాహలం నెలకొంది.
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









