IPL 2026 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మినీ వేలం..ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే? పూర్తి వివరాలివే!

IPL 2026 Auction Purse All Team: 2026 ఐపీఎల్ మినీ వేలానికి వేళ అయ్యింది. డిసెంబరు 16న రాబోయే ఐపీఎల్ సీజన్‌కు వేలం జరగనుంది. దీంతో ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ జట్లలోకి ఉత్తమ ఆటగాళ్లను చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఒప్పందాలు జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Written by - Harish Darla | Last Updated : Dec 14, 2025, 05:46 PM IST
IPL 2026 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మినీ వేలం..ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే? పూర్తి వివరాలివే!

IPL 2026 Auction Purse All Team: 2026 ఐపీఎల్ మినీ వేలానికి వేళ అయ్యింది. డిసెంబరు 16న రాబోయే ఐపీఎల్ సీజన్‌కు వేలం జరగనుంది. దీంతో ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ జట్లలోకి ఉత్తమ ఆటగాళ్లను చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఒప్పందాలు జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Add Zee News as a Preferred Source

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. మినీ వేలంలో పాల్గొనేందుకు ఈ జట్టు వద్ద రూ.64.3 కోట్ల పర్స్ వ్యాల్యూ ఉంది. బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‌ను రిలీజ్ చేయడం ద్వారా ఆ జట్టుకు రూ.23 కోట్లు ఒకేసారి యాడ్ అయ్యాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): మినీ వేలానికి ముందు వెళ్లే ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వద్ద 43.4 రూపాయల పర్స్ వ్యాల్యూ ఉంది. ఈ టీమ్ ఇప్పటికే సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్న సంగతి తెలిసిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): కావ్యా మారన్ యజమానికి వ్యవహరిస్తున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ టీమ్ వద్ద రూ. 25.5 కోట్ల పర్స్ వాల్యూ అందుబాటులో ఉంది. ఈ టీమ్‌లో రెండు విదేశీ స్లాట్‌లు మిగిలున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG): ఐపీఎల్ మినీ వేలం కోసం లక్నో సూపర్ జైయింట్స్ వద్ద రూ. 22.95 కోట్ల డబ్బు కలిగి ఉంది. అయితే ఈ టీమ్‌లో కేవలం ఆరుగురు ఆటగాళ్ల కోసం మాత్రమే ఖాళీ ఉంది. ట్రేడింగ్ సమయంలో మహమ్మద్ షమీ చేరడం వల్ల.. ఈ టీమ్ ఇప్పుడు ఫినిషర్, బ్యాకప్ పేసర్ గా ఓ విదేశీ బ్యాటర్‌ను చూస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వద్ద రూ. 21.8 కోట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇదే పర్స్ వాల్యూతో ఈ టీమ్ ఐపీఎల్ మినీ వేలంలోకి ప్రవేశిస్తుంది. గత సీజన్‌లో ఫాప్ డుప్లెసిస్ అలరించగా.. ఈ సీజన్‌లో తప్పుకున్నాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌కిర్క్‌ను కూడా విడుదల చేశారు. ఈ టీమ్‌లో ఇప్పటికే 8 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): 2025లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026లోకి అడుగుపెడుతుంది. అయితే కేవలం రూ.16.4 కోట్ల విలువైన పర్స్ వాల్యూతో మినీ వేలంలో అడుగుపెడుతున్నారు. 

రాజస్థాన్ రాయల్స్ (RR): రాజస్థాన్ రాయల్స్ టీమ్ వద్ద ప్రస్తుతం ఉన్న రూ.16.05 కోట్ల బిడ్‌తో మినీ వేలలోకి అడుగుపెడుతున్నారు. సంజు సామ్సన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన తర్వాత అదే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. 

గుజరాత్ టైటాన్స్ (GT): రూ.12.9 కోట్ల పర్స్ వాల్యూతో ఈసారి ఐపీఎల్ మినీ వేలంలోకి అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్.. ఇప్పుడు 5 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. 

పంజాబ్ కింగ్స్ (PBKS): శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్‌లో పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈసారి ట్రోఫీని దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఈ టీమ్ వద్ద రూ.11.5 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. 

ముంబై ఇండియన్స్ (MI): అంబానీ యాజమానిగా ముంబయి ఇండియన్స్ ఈ జాబితాలో చివర్లో ఉంది. ఈ జట్టు రూ.2.75 కోట్ల విలువైన పర్స్ తో వీళ్లు 5 ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

Also Read: 4 Days Work Week: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..వారానికి మూడు రోజులు సెలవులు..4 రోజులే పని..ఎప్పుడు నుంచి అంటే?

Also REad: BSNL 3300 GB Plan: 399 రూపాయలకే మూడు నెలల రీఛార్జ్..3300 జీబీ డేటా పూర్తి ఉచితం..BSNL బంపర్ ఆఫర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News