Rawalpindi Stadium: క్రికెట్‌ స్టేడియంపై భారత్‌ డ్రోన్‌ దాడి.. దెబ్బకు పాక్‌ లీగ్‌ మ్యాచ్‌లు తరలింపు

Indian Drone Hit Rawalpindi Stadium: దాయాది పాకిస్థాన్‌పై భారత్‌ తీవ్రస్థాయిలో దాడి చేస్తుండడంతో అక్కడి ప్రజలతోపాటు క్రికెటర్లు గజగజ వణికిపోతున్నారు. భారత్‌ ప్రయోగించిన ఓ డ్రోన్‌ అక్కడి అతిపెద్ద రావల్పిండి స్టేడియంపై పడింది. దీంతో మ్యాచ్‌లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 8, 2025, 05:36 PM IST
Rawalpindi Stadium: క్రికెట్‌ స్టేడియంపై భారత్‌ డ్రోన్‌ దాడి.. దెబ్బకు పాక్‌ లీగ్‌ మ్యాచ్‌లు తరలింపు

  Rawalpindi Stadium: భారత్, పాకిస్థాన్‌ మధ్య ఏర్పడిన యుద్ధంతో క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌తోపాటు పాకిస్థాన్‌లో జరుగుతున్న పీఎస్‌ఎల్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్‌ చేస్తున్న దాడులతో పాకిస్థాన్‌ గజగజ వణుకుతుండగా.. క్రికెటర్లకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. భారత్‌ చేస్తున్న దాడుల్లో పాక్‌లోని ప్రముఖ స్టేడియంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ స్టేడియంపై భారతదేశం ప్రయోగించిన డ్రోన్‌ పడడంతో క్రికెటర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. భారత్‌ దెబ్బకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వెంటనే మ్యాచ్‌లన్నింటిని ఇతర నగరానికి తరలించింది. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: India Pakistan War: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్థాన్‌ రక్షణ వ్యవస్థలు ధ్వంసం

పాకిస్థాన్‌లో ఉన్న స్టేడియాల్లో రావల్పిండి ప్రధానమైనది. అక్కడ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా రావల్పిండి స్టేడియంలో కూడా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇదే స్టేడియంలో గురువారం పెషవర్‌ జల్మీ, కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ భారత్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఈ స్టేడియంలో మ్యాచ్‌పై సందిగ్ధం ఏర్పడింది. ఇదే క్రమంలో ఆ స్టేడియంపై భారతదేశం డ్రోన్‌ను ప్రయోగించింది. దీంతో జరగాల్సిన ఆ మ్యాచ్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. భారత్‌ చేసిన దాడిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు దిగ్భ్రాంతికి గురయ్యింది. క్రీడాకారుల క్షేమం దృష్ట్యా పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లన్నింటిని రావల్పిండి నుంచి కరాచీకి తరలించారు. జరగాల్సిన 10 మ్యాచ్‌లు అక్కడకు తరలించారని తెలుస్తోంది.

Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్దం.. ఎల్లుండి నుంచి అందగత్తెల పండుగ

భారతదేశంలో కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో భీకర వాతావరణం ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లపై సందిగ్ధం నెలకొంది. మే 11వ తేదీన ఐపీఎల్‌లో భాగంగా జరగాల్సిన ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌ ధర్మశాలలో కాకుండా అహ్మదాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ధర్మశాలలో తీవ్ర ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గగనతలం మూసివేయడంతో అక్కడకు క్రికెటర్లు వెళ్లలేని పరిస్థితి. అంతేకాకుండా పాక్‌ నుంచి దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్‌ను అహ్మద్‌బాద్‌కు పంపించారు. అయితే ఇప్పటికే ధర్మశాలలో క్రికెటర్లు ఉండడంతో గురువారం పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

 

 

 

ఐపీఎల్‌ వాయిదా?
యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహించడం అవసరమా? అని క్రికెట్‌ప్రియులు ప్రశ్నిస్తున్నారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో క్రీడా టోర్నీలు రద్దు చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఇంకా ప్లేఆఫ్స్‌ దశకు రాకపోవడంతో ఐపీఎల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో అధిక వెలుగులు ఉండరాదు. మరి క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్లడ్‌ లైట్ల వెలుగులో జరుగుతుంటాయి. అది దేశానికి ప్రమాదకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News