Delhi Capitals buy David Warner for 6.25 crore: కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మెగా వేలం 2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో ఉన్న ప్రతిఒక్కరు అమ్ముడుపోయారు. ఇండియన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ను 12.25 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. ఇక ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ రూ. 8.25 కోట్లకు, పేసర్ కగిసో రబడ 9.25 కోట్లకు కూడా మంచి ధరకే అమ్ముడుపోయారు. అయితే ఎన్నో అంచనాలు మధ్య వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ట్రోఫీని అందించిన వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొనగా.. చివరికి ఢిల్లీ దక్కించుకుంది. గతంలో వార్నర్ ఢిల్లీకి ఆడిన విషయం తెలిసిందే. వార్నర్ కనీస ధర 2 కోట్లు.


డేవిడ్ వార్నర్ తన తుఫాన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌తో ఎంతటి బౌలర్‌ను అయినా బయపెట్టగలడు. ఐపీఎల్ టోర్నీలో కూడా ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. అలాగే నాయకత్వంలో కూడా రాణించాడు. అయితే గతేడాది పేలవ ఫామ్ కారణంగా పరుగులు చేయలేకపోయాడు. దాంతో అతడిపై భారీ ప్రభావమే పడింది.



గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్‌కు 12 కోట్లు చెల్లించింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్  6.25 కోట్లకు కైవసం చేసుకుంది. అంటే వార్నర్ ధర సగానికి పడిపోయింది. 15 కోట్లకు పైగా అమ్ముడుపోతాడని అందరూ అనుకున్నా.. వార్నర్ అంత ధర పలకలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథి అవసరం ఉండడంతో అతడి కోసం పోటీ పడుతుంది అనుకుంటే. అలా ఏమీ జరగలేదు. దాంతో సోషల్ మీడియాలో వార్నర్‌పై ట్రోల్ల్స్ వస్తున్నాయి. 'అయ్యో డేవిడ్ వార్నర్.. ఎంత పనాయే', 'మరీ ఇంత తక్కువనా!' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. 


Aslo Read: KKR Shreyas Iyer: భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కైవసం చేసుకున్న కేకేఆర్ .. కెప్టెన్‌గా ఎంపిక లాంఛనమే!!


Also Read: IPL Auction 2022: శిఖర్ ధావన్‌ను కైవసం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. అభిమానులకు మాత్రం బ్యాడ్‌న్యూస్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook