Kavya Maran Cars Collection: ఆరెంజ్ ఆర్మీ కావ్య పాప లగ్జరీ కార్ల జాబితా తెలుసా

Kavya Maran Luxury: ప్రతిసారీ ఐపీఎల్‌లో క్రికెటర్ల కంటే ప్రత్యేక ఆకర్షణ ఓనర్లపై ఉంటోంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ లెవెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్లపై అందరి దృష్టీ ఉంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 07:39 AM IST
Kavya Maran Cars Collection: ఆరెంజ్ ఆర్మీ కావ్య పాప లగ్జరీ కార్ల జాబితా తెలుసా

Kavya Maran Cars Collection: ఐపీఎల్ 2025లో ఇప్పుడు అందరి దృష్టీ పంజాబ్ కింగ్స్ లెవెన్ యజమాని ప్రీతి జింటా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య పాపపైనే ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఈ ఇద్దరి హావభావాలు అన్నీ కెమేరాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య పాప ఎప్పుడూ ప్రత్యేకమే. 

Add Zee News as a Preferred Source

క్రికెట్ గ్యాలరీలో ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య పాప చాలా ప్రత్యేకంగా కన్పిస్తోంది. మ్యాచ్ విజయంలోనూ పరాజయంలోనూ ఆమె చూపించే ఫీలింగ్స్ అందర్నీ ఆకర్షిస్తుంటాయి. అందుకే ఆ సీన్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. కావ్య పాప కేవలం వీటికే కాదు లగ్జరీకు కూడా పెట్టింది పేరు. కావ్యను లగ్జరీకు కేరాఫ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఆమె గ్యారేజ్ లో 400 కోట్లకు పైగా విలువ కలిగిన లగ్జరీ కార్లు ఉంటాయి. అందులో బెంట్లే నుంచి బీఎండబ్ల్యూ వరకూ ఉంటాయి. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. ఇంగ్లండ్‌లోని బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. తండ్రి వ్యాపారాన్ని దిగ్విజయంగా చూసుకుంటోంది. 

ఫెర్రారీ రోమా..కావ్య మారన్ లగ్జరీ కలెక్షన్లలో ఇదొకటి. ఈ కారు 4.5 కోట్లు ఉంటుంది. 680 హెచ్‌పి పవర్, 760 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఇక బెంట్లే బెంటయా ఈడబ్ల్యూబీ కారు ధర 6 కోట్లు దాటి ఉంటుంది. ఇందులో 4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇందన్ 542 హెచ్‌పి వవర్, 770 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.

ఇక మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీ. ఈ కారు ధర 12 కోట్లపైనే ఉంటుది. 21 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్ ఉంటాయి. 6.72 లీటర్ వీ12 ట్విన్ టర్బో ఛార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. 571 హెచ్‌పి వపర్, 900 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక మరో లగ్జరీ కారు బీఎండబ్ల్యూ ఐ7. ఈ కారు ధర 2.03 కోట్లు ఉంటుంది. ఇదొక లగ్జరీ ఎలక్ట్రిక్ కారు. 101.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్ కలిగి ఉంటుంది. 600 కిలోమీటర్లు దాటి మైలేజ్ ఇస్తుంది. 

Also read: DC vs MI Live: ఢిల్లీ జైత్రయాత్రకు బ్రేక్.. ముంబై ఇండియన్స్‌పై పోరాడి ఓడిన క్యాపిటల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News