IPL Match: హైదరాబాద్ వేదికగా నేడు కీలకమైన ఐపీఎల్ మ్యాచ్.. ఫ్యాన్స్ లో సర్వత్రా ఉత్కంఠ..

IPL Match 2025:  హైదరాబాదీలను ఐపీఎల్ జ్వరం పట్టుకుంది. నేడు (ఆదివారం) ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తమ వేటను ప్రారంభించనుంది సన్‌ రైజర్స్‌. తొలిగేమ్‌లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 09:26 AM IST
IPL Match: హైదరాబాద్ వేదికగా నేడు కీలకమైన ఐపీఎల్ మ్యాచ్.. ఫ్యాన్స్ లో సర్వత్రా ఉత్కంఠ..

IPL Match 2025:ఈ సారి ఐపీఎల్ టోర్నీలో  హైదరాబాద్ అంటేనే ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. ఐపీఎల్-2024లో ఆ జట్టు విధ్వంసకర ఆటతీరే అందుకు కారణం. గత సీజన్‌లో SRH పరుగుల వరద పారించింది. లీగ్ చరిత్రలోనే మూడుసార్లు రికార్డు హయ్యెస్ట్ స్కోరు నమోదు చేసిందంటే ఆ జట్టు ఏ విధంగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. సంచలన ప్రదర్శనతో తృటిలో టైటిల్ కోల్పోయిన సన్‌రైజర్స్ ఈ సారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్‌కు సిద్ధమైంది.

Add Zee News as a Preferred Source

ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌‌ను తక్కువ అంచనా వేయడానికి రాలేదు. ఆ జట్టుతో గట్టి పోటీ తప్పదనేలా ఉంది. యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది.

హైదరాబాద్ బౌలర్లు ఏ మేరకు ప్రత్యర్థిని కట్టడి చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌‌పై హైదరాబాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచింది. ఈ సారి కూడా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది హైదరాబాద్ సన్ రైజర్స్.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News