)
IPL Retention 2026 Where To Watch Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2026) రాబోయే ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్లు, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఆ వివరాలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ప్రకటించనున్నాయి. ఇప్పటికే షార్దూల్ ఠాకూర్, షేర్ఫేన్ రూథర్ ఫోర్డ్‌లను ముంబై ఇండియన్స్ ట్రేడ్ డీల్ ద్వారా సొంతం చేసుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్, బౌలర్ మహమ్మద్ షమీలపై గందరగోళం కొనసాగుతోంది. ఇప్పుడు, ఈ రిటెన్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుందాం.
జట్ల నిలుపుదల గడువు ఎంత?
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమ నిలుపుకొంటున్న ప్లేయర్లు, రిలీజ్ చేయనున్న ఆటగాళ్ల జాబితాలను సమర్పించడానికి నవంబర్ 15వ తేదీ శనివారం వరకు సమయం ఉంది. అన్ని జట్ల నిలుపుదల, విడుదల జాబితాలు ఇదే రోజున వెల్లడి చేస్తారు.
ఐపీఎల్ నిలుపుదల నియమాలు ఏమిటి?
మెగా వేలం నిర్వహించినప్పుడు, జట్లు సాధారణంగా విదేశీ ఆటగాళ్లైనా లేదా భారతీయులైనా, ఎంత మంది ఆటగాళ్లను నిలుపుకోగలవో పరిమితంగా ఉంటాయి. అయితే ఈసారి ఇది మెగా వేలం కాకపోవడం వల్ల జట్లు తమకు నచ్చినంత మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. జట్లు 25 మంది ఆటగాళ్లను నిలుపుకోవాలి. ప్రతి ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ సుమారు రూ.120 కోట్లు ఉంటుంది.
IPL 2026 వేలం ఎప్పుడు జరుగుతుంది?
IPL 2026 వేలానికి ఇంకా స్పష్టమైన తేదీ లేదు. అయితే డిసెంబర్ 13, 16 మధ్య ఇది జరగవచ్చనే ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. కొందరు విశ్లేషకులు వేలం మరోసారి విదేశాలలో జరుగుతుందని అంటున్నారు. మునుపటి రెండు సీజన్ల IPL వేలం విదేశాల్లోనే జరిగాయి.
IPL 2026 రిటెన్షన్‌ను మీరు ఎప్పుడు, ఎక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు?
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించే రోజు రానే వచ్చింది. నవంబరు 15న శనివారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఎప్పుడు ప్రసారం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. జియో హాట్‌స్టార్ OTT వేదిక ద్వారా లైవ్‌లో చూడొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook