IPL 2025 SRH vs RR: ఐపీఎల్ సీజన్ 18లో రేపు మార్చ్ 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. గత ఏడాది టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన ఎస్ఆర్‌హెచ్‌పై ఈసారి చాలా అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం సమర్ధవంతమైన ఆటగాళ్లు ఉండటమే.
సొంత పిచ్ ఉప్పల్ వేదికగా మార్చ్ 23న రేపు మద్యాహ్నం 3.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలవడంతో ఎస్ఆర్‌హెచ్ రెండోసారి టైటిల్ గెల్చుకునే అవకాశం కోల్పోయింది. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి బౌలింగ్ పరంగా కూడా పటిష్టమైంది. ఇప్పటికే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక మెగా వేలంలో మొహమ్మద్ షమి, జంపా, రాహుల్ చహర్‌లను దక్కించుకుని బౌలింగ్ పటిష్టం చేసుకుంది. ఎందుకంటే బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ ఉండనే ఉన్నాడు. మొత్తానికి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పరంగా పటిష్టంగా మారింది.
వాస్తవానికి గత సీజన్‌లోనే ఎస్ఆర్‌హెచ్ అద్దరగొట్టే బ్యాటింగ్తో అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అదనంగా ఇషాన్ కిషన్ వచ్చి చేరాడు. గత సీజన్‌లో 260 పై పరుగులు మూడుసార్లు చేసింది. ఒకసారి ఏకంగా 287 పరుగుల వరకూ చేయగలిగింది. ఈసారి అందుకే ఎస్ఆర్‌హెచ్ 300 పరుగులు చేస్తుందనే అంచనా ఉంది. వాస్తవానికి ఎస్ఆర్‌హెచ్ లైనప్ చూస్తే ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంత సమర్ధవంతమైన ఆటగాళ్లు కన్పించడం లేదు. రాహల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నా బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, చహల్ వంటి ఆటగాళ్లు దూరమయ్యారు. బౌల్ట్ కూడా జట్టులో లేడిప్పుడు. ఇక ఫిట్ నెస్ కారణంగా సంజూ శామ్సన్ తొలి 3 మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్కే పరిమితం కానున్నాడు. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టును ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. అందరి ఆశలు రియాన్ పరాగ్ , యశస్వి జైశ్వాల్, సంజూ శామన్స్‌పైనే ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా
పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, జంపా, ఉనద్కత్
Also read: IPL 2025 Open Ceremony: అత్యంత వైభవంగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్, తొలి మ్యాచ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









