)
Ishan Kishan Century In 33 Balls: జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విజయ్ హజారే ట్రోఫీలో సూపర్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కిషన్ నిలిచాడు.
అయితే విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు బీహార్‌కు చెందిన సకిబుల్ గని పేరిట ఉంది. కిషన్ బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన బీహార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డును ఇషాన్ కిషన్ బద్దలు కొట్టాడు. ఈ రికార్డును కిషన్ అధిగమించాడు.
మిడిల్ ఆర్డర్ నుంచి ఇషాన్ కిషన్ సెంచరీ చేసినందుకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కిషన్ జార్ఖండ్ తరఫున 6వ స్థానంలో నిలిచి అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. 27 ఏళ్ల ఇషాన్ కిషన్ కర్ణాటకపై 39 బంతుల్లో ఏడు ఫోర్లు, 14 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 320.15. టీ20 ప్రపంచ కప్ కోసం ఇషాన్ కిషన్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
జార్ఖండ్, కర్ణాటక మధ్య గ్రూప్ A మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన కర్ణాటక మొదట బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (125), కుమార్ కుషాగ్ర (63), విరాట్ సింగ్ (88) ఇన్నింగ్స్‌తో రాణించారు. జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేశాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ 49 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 101 పరుగులు చేశాడు. SMAT ఫైనల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి