Ishan Kishan IPL Century: పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి ద్రుష్టిలో పడ్డాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్ మెగా వేలంలోకి వచ్చాడు. వేలంలో ఇసాన్ కిషన్ ను హైదరాబాద్ 11.25కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ ధరకు న్యాయం చేస్తూ తొలి మ్యాచులోనే సెంచరీ చేశాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో ఇషాన్ ను మళ్లీ టిమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
టీమిండియా తరపున చివరగా 2023 నవంబర్ లో ఆడిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. కొన్నేళ్ళ క్రితం వరకు వన్డేలు, టీ20ల్లో భారత జట్టులో కీలకంగా వ్యవహరించాడు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా రాణించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఇసాన్ కూడా ఒకరు. జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ మాటలను ఇషాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. దీంతో 2024లో ఇషాన్ ఐపీఎల్ లో ఆడాడు ఆ తర్వాత వెనక్కి తగ్గిన కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడాడు.
Also Read: ATM New Charges: బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఏటీఎం నుంచి డ్రా చేస్తే ఛార్జి కట్టాల్సిందే
బుచ్చిబాబు టోర్నీలోనూ రాణించాడు. దీంతో దులీప్ ట్రోఫీలోనూ చోటు దక్కింది. ఇండియా సి తరుపున 126 బంతుల్లో 111 పరుగులు చేసి జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సెలక్టర్లకు సందేశం ఇచ్చాడు. తర్వాత రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్ కు కెప్టెన్సీ వహించి సెంచరీతో అదరగొట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ మెరుపు సెంచరీతో అలరించాడు. ఈ మెగా టోర్నీలో మునుముందు ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ ఇషాన్ జాతీయ జట్టులోకి రావడం ఖాయమని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: Vivo T4x 5G: అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5జీ ఫోన్ రూ.17 వేలలోపే! వివో టీ4ఎక్స్ ఫీచర్లు ఇవే!
అయితే ఇషాన్ కిషన్ కు ఈ సెంచరీ అంత ఈజీగా చేయలేదు. కొన్ని నెలలపాటు గ్రౌండ్ లో శ్రమించాడు. నాకు చాలా సమయం ఉంది. బ్యాటింగ్ కోసం సాధన చేశాను. ప్రిపరేషన్ బాగుందని కిషన్ ఆదివారం వ్యాఖ్యానించడం ఇందుకు ఉదాహరణ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









