2025 Champions Trophy Views: 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా జరిగిన ఫైనల్ భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రికార్డ్ స్థాయి వ్యూవర్షిప్ సంపాదించింది. ఈ మ్యాచ్ కు 90 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఏకకాలంలో 6.1 కోట్ల మంది వీక్షించారు. తాజాగా టోర్నీ మొత్తం వ్యూవర్ షిప్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ టోర్నీకి ఏకంగా భారత్ , చైనా జనాభా కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9 విజయవంతంగా ముగిసింది. ప్రతీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. దీంతో టోర్నీకి భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఈ మ్యాచులన్నింటినీ జియో స్టార్ లైవ్ స్ట్రీమింగ్ అందించింది. ఈ క్రమంలో టోర్నీ మొత్తానికి 540.3కోట్ల వ్యూస్ వచ్చినట్లు జియో హాట్ స్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి వెల్లడించారు. అందులో 11వేల కోట్ల నిమిషాల వాచ్ టైమ్ నమోదు అయ్యింది. ఏకకాలంలో అత్యధికంగా ఒకేసారి 6.2కోట్ల మంది వీక్షించారు.
That win grin ??
#TeamIndia | #INDvNZ | #ChampionsTrophy | #Final pic.twitter.com/xcpmVoaNez
— BCCI (@BCCI) March 11, 2025
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ప్రేక్షాకాదరణ దక్కింది. కోట్లాది మంది చూసే ఛాన్స్ వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఒక్కరోజులోనే అత్యధిక సబ్ స్క్రిప్షన్లను సాధించామని సబ్ స్క్రిప్షన్ల గురించి కిరణ్ వెల్లడించారు. హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి 38శాతం లైవ్ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినట్లు ఇంకో ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ వచ్చాయి. తొలిసారి ఐసీసీ ఈవెంట్ ను బ్రాడ్ కాస్టింగ్ చేసిన జియో హాట్ స్టార్ 9 ప్రాంతీయ భాషల్లో కామెంటేటరీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









