Jos Buttler: బ్యాట్‌తో బట్లర్‌ పరుగుల సునామీ.. ఢిల్లీపై గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం

Jos Buttler Missed Centuary In GT vs DC: ఫోర్లు, సెంచరీలతో జోస్‌ బట్లర్‌ విరుచుకుపడడంతో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత విజయం సాధించగా.. వరుస విజయాలతో జోష్‌ మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆసక్తిగా సాగిన జీటీ వర్సెస్‌ డీసీ మ్యాచ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 19, 2025, 07:56 PM IST
Jos Buttler: బ్యాట్‌తో బట్లర్‌ పరుగుల సునామీ.. ఢిల్లీపై గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం

GT vs DC Highlights: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో పూర్తి ఉత్సాహంతో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆసక్తికర పోరు కొనసాగగా.. జోస్‌ బట్లర్‌ అద్భుత సెంచరీతో టైటాన్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విధించిన ద్విశతకం లక్ష్యాన్ని గుజరాత్‌ సునాయాసంగా చేధించింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. ఢిల్లీ కొంత వెనుకబడింది.

Add Zee News as a Preferred Source

Also Read: DC vs RR Super Over: నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ 'సూపర్‌' విజయం.. అసలైన మజా అంటే ఇదే!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఏ బ్యాటర్‌ కూడా భారీ పరుగులు చేయకున్నా అందరూ తలా కొన్ని పరుగులు చేయడంతో జట్టు భారీగానే స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ 32 బంతుల్లో 39 పరుగులు చేయగా.. టాపార్డర్‌ బ్యాటర్లు అభిషేక్‌ పరేల్‌ (18) తక్కువ స్కోర్‌ చేశాడు. కరుణ్‌ నాయర్‌ 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. కేఎల్‌ రాహుల్‌ (28) భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. త్రిస్టన్‌ స్టబ్స్‌ (31), అశుతోష్‌ శర్మ (37) బ్యాట్‌తో కొన్ని పరుగులు రాబట్టారు. గుజరాత్‌ బౌలర్లు మొదట కొంత తడబడినా ఆఖరులో మాత్రం అద్భుతం చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి భారీ స్కోర్‌ దిశగా వెళ్తున్న స్కోర్‌ బోర్డుకు అడ్డుకట్ట వేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆఖరులో ఢిల్లీని చావు దెబ్బ కొట్టాడు. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, సాయి కిశోర్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: PBKS vs KKR Highlights: నిప్పులు చెరిగిన బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై పంజాబ్‌ విజయం

సొంత గడ్డ అహ్మదాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతం చేసింది. ఈ సీజన్‌లో సొంత మైదానంలో తొలి విజయాన్ని అందుకుంది. 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి గుజరాత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ (7) అతి తక్కువ పరుగులతో నిరాశపర్చగా.. జోస్‌ బట్లర్‌ పరుగుల సునామీ సృష్టించాడు. 54 బంతుల్లో 97 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో సంచలన ప్రదర్శన చేశాడు. బట్లర్‌కు సహకరిస్తూ చక్కటి భాగస్వామ్యం అంఇంచిన రూథర్‌ఫోర్డ్‌ 43 పరుగులు చేశాడు. ఆఖరులో వచ్చిన రాహుల్‌ తెవాటియా విన్నింగ్‌ షాట్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. 3 బంతుల్లో 11 పరుగులు చేయడం విశేషం. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను బౌలర్లు కాపాడలేకపోయారు. ఏ ఒక్క బౌలర్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పరుగులను నియంత్రించకపోగా.. వికెట్లు కూడా తీయలేకపోయారు. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

జట్లు పైకి కిందకు
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ కిందకు దించేసింది. 7 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ 5 విజయాలు, 2 ఓటములతో ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉంది. మ్యాచ్‌ను కోల్పోయిన ఢిల్లీ ఒకస్థానం కిందకు జారి పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి రెండింట ఓడిపోయింది. అయినా కూడా నెట్‌ రన్‌రేట్‌తోపాటు అద్భుతమైన మ్యాచ్‌లను కైవసం చేసుకోవడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ముందుస్థానంలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News