
Jos Buttler Dropped: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాభవం ఎదుర్కొన్న అనంతరం ఇంగ్లండ్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. గ్రూప్ దశలోనే జట్టు నిష్క్రమించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతోపాటు ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగారు. ఈ నేపథ్యంలోనే బట్లర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రేపు కెప్టెన్‌గా బట్లర్ చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనున్నాడు.
పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా 2022 జూన్‌లో జోస్ బట్లర్ ఇంగ్లండ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్ మోర్గాన్ నుంచి బాధ్యతలు చేపట్టిన బట్లర్ 20022 టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వన్డేల్లో మాత్రం బట్లర్ కెప్టెన్సీలో జట్టు ఘోర ప్రదర్శనను కనబర్చింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 22 మ్యాచ్‌ల్లో విఫలమైంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆ దేశ జట్టు ఘోర ప్రదర్శన కనబర్చింది. ఏడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరకుండానే ఇంటికి వెళ్లింది.
వన్డే ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఆడిన 17 వన్డేల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించడం చూస్తే బట్లర్ కెప్టెన్‌గా ఎంత విఫలమయ్యాడో అర్థమవుతోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా కూడా ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్‌కు పరాభవం తప్పలేదు. రెండో మ్యాచ్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌ను చేతుల్లో నుంచి లాగేసుకుంది. అఫ్ఘాన్ సంచలన విజయంతో ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ కెప్టెన్సీని తప్పుబడుతున్నారు. కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బట్లర్ ఎట్టకేలకు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.
BREAKING: Jos Buttler has stood down as England white-ball captain, following his side's Champions Trophy exit ? pic.twitter.com/BQ5yiy4yTa
— Sky Sports Cricket (@SkyCricket) February 28, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి