Kamindu Mendis SRH 2025: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ విజయంతో మంచి ఊపుమీదుంది. అదే ఉత్సాహంతో, మార్చి 27న తన సొంత మైదానం, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించింది. రెండో మ్యాచ్‌లో కూడా గెలవాలనే లక్ష్యంతో వారు మైదానంలోకి దిగనున్నారు. ఇంతలో, సన్‌రైజర్స్ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌లో, ఒక ఆల్ రౌండర్ తన ప్రత్యేక ప్రతిభతో ఆకట్టుకున్నాడు.
సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ కమిండు మెండిస్ తన బహుముఖ ప్రజ్ఞ కారణంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాధారణంగా కుడిచేతి వాటం బౌలింగ్ చేసే కామిందు, ప్రాక్టీస్ సెషన్‌లో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అతను రెండు చేతులతో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సన్‌రైజర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా Xలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న అభిమానులు 'కమిందు ప్రతిభ సూపర్', 'రెండో మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వండి' అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: IPL 2025: దెబ్బ గట్టిగా పడింది.. స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల
From Sri Lanka, with love ?, & now ready to #PlayWithFire ?
Kamindu Mendis | Eshan Malinga pic.twitter.com/ePCie8I14g
— SunRisers Hyderabad (@SunRisers) March 12, 2025
ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బేస్ ధర రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది . ఇది అతనికి తొలి ఐపీఎల్ సీజన్. 26 ఏళ్ల కమిందు శ్రీలంక తరఫున 23 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో, అతను 381 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో 39 మ్యాచ్‌ల్లో 782 పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్ చేస్తూ 5 అర్ధ సెంచరీలు సాధించాడు. బౌలింగ్ చేస్తూ 8 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL 2025: నువ్వు నిజంగా లెజెండ్ బ్రో.. ఏకంగా బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన రషీద్
ఐపీఎల్ టైటిల్ కోసం బలమైన పోటీదారుగా టోర్నమెంట్‌లోకి ప్రవేశించిన సన్‌రైజర్స్ మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు (286) చేసింది.జట్టు తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ సెంచరీ సాధించాడు. అతను 47 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇంతలో, ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67) అద్భుతంగా రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి (30), క్లాసెన్ (34) కూడా బ్యాటింగ్‌తో గణనీయమైన సహకారాన్ని అందించారు. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 242 పరుగులు మాత్రమే చేసి 44 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









