KKR vs DC Highlights: ఢిల్లీ తడ'బ్యాటు'.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోల్‌కత్తా భారీ విజయం

Kolkata Knight Riders Retains IPL 2025 Playoff Hopes: వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడుతోంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పరాజయం పాలైంది. బ్యాటర్లు తడబడడంతో మ్యాచ్‌ను కోల్పోవాల్సి రాగా.. కోల్‌కత్తా కీలక విజయాన్ని అందుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2025, 12:01 AM IST
KKR vs DC Highlights: ఢిల్లీ తడ'బ్యాటు'.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోల్‌కత్తా భారీ విజయం

Kolkata Knight Riders: టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ద్వితీయార్ధానికి వచ్చేసరికి గాడీ తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పరాభవం ఎదుర్కొంది. ఓటములతో సతమతమవుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ముందడుగు వేయాలంటే నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 14 పరుగుల తేడాతో కోల్‌కత్తా ఓడించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Allu Arjun Sritej: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. బ్యాటర్లంతా సమష్టి కృషి భారీ స్కోర్‌ నమోదు చేశారు. అందరూ బ్యాటర్లు తలా కొంత పరుగులు జోడించి రెండొందలు దాటించారు. ఓపెనర్లతోపాటు చివరి బ్యాటర్‌ కూడా మోస్తరు పరుగులు సాధించడం విశేషం. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 32 బంతుల్లో చేసిన 44 పరుగులు అత్యధిక స్కోర్‌ కాగా.. రింకూ సింగ్‌ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. రహ్మనుల్లా గుర్బాజ్‌ (26), సునీల్‌ నరైన్‌ (27), కెప్టెన్‌ అజింక్యా రహానే (26), ఆండ్రె రస్సెల్‌ (17) బ్యాట్‌తో మోస్తరు స్కోర్‌ నమోదు చేశారు. వెంకటేశ్‌ అయ్యర్‌ 7 పరుగులకే పరిమితమవగా.. రౌమన్‌ పావెల్‌ 5 స్కోర్‌ చేయగా.. అనుకూల్‌ రాయ్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినా స్కోర్‌ బోర్డును నియంత్రించలేకపోయారు. ఆలౌట్‌కు ఒక వికెట్‌ దూరంలో నిలిచినా స్కోర్‌ మాత్రం భారీగానే ఇచ్చారు. మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. విప్రజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. దుష్మంత చమీర ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Indian Army: రెండు, మూడు రోజుల్లో పాకిస్థాన్‌పై యుద్ధం? సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం చేసినా ఫలితం చేదు మిగిలింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగుల వద్ద ఢిల్లీ ఆగిపోయింది. అభిషేక్‌ పరేల్‌ (4), కేఎల్‌ రాహుల్‌ (7), త్రిస్టన్‌ స్టబ్స్‌ (1), అశుతోష్‌ శర్మ (7) తక్కువ పరుగులు చేయగా.. మిచెల్‌ స్టార్క్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఫాఫ్‌ డుప్లెసిస్‌ చెలరేగి ఆడి 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ 43 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. విప్రజ్‌ నిగమ్‌ 38 పరుగులతో రాణించగా.. కరుణ్‌ నాయర్‌ (15) కొన్ని పరుగులు చేశాడు. బ్యాటర్లు నిలిపిన భారీ స్కోర్‌ను కోల్‌కత్తా బౌలర్లు కాపాడి జట్టుకు విజయాన్ని అందించారు. సునీల్‌ నరైన్‌ 3 వికెట్లు తీసి సత్తా చాటగా.. వరుణ్‌ చక్రవర్తి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టగా.. రస్సెల్‌, అనుకూల్‌ రాయ్‌, వైభవ్‌ అరోరా ఒక్కొక్క వికెట్‌ తీసి విజయంలో భాగమయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News