RR vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఆరో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో KKR జట్టు ఈ సీజన్‌లో విజయాల ఖాతాను తెరిచింది. ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన తర్వాత KKR జట్టు కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ తరఫున ధ్రువ్ జురెల్ 33 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టగా, స్పెన్సర్ జాన్సన్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు. దీనికి ప్రతిస్పందనగా, KKR ఆటగాడు క్వింటన్ డి కాక్ 97 పరుగుల అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్ ఆడాడు, ఈ మ్యాచ్‌లో అతను తన జట్టుకు ఏకపక్ష విజయాన్ని అందించగలిగాడు. డి కాక్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు, KKR జట్టు నుండి వనిందు హసరంగా మాత్రమే ఒక వికెట్ తీయగలిగాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. మిడిల్ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 28 బంతుల్లో 5 ఫోర్లు కొట్టి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 2 ఫోర్లు 2 సెక్సులు కొట్టాడు. సంజు శాంసన్ 11 బంతుల్లో 2 ఫోర్లు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ దూకుడుగా ఆడినప్పటికీ క్రీజులో నిలదొక్కలేదు. నితీశ్ రాణా, వానిందు హసరంగ, శుభమ్ దూబె విఫలం అయ్యారు. జోఫ్రా ఆర్చర్ పోరాటంతో స్కోర్ 150 దాటింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మెయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీశారు. స్పెన్సర్ జాన్సన్ కు ఒక వికెట్ మాత్రమే దక్కింది.
ఇక రాజస్థాన్ కు శుభారంభమే దక్కింది. జైస్వాల్ నిలకడగా ఆడటంతో తొలి వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యం నమోదు అయ్యింది. వైభవ్ వేసిన 4వ ఓవర్ లో శాంసన్ ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ల రాకతో రాజస్థాన్ మరింత కష్టాల్లో పడినట్లయ్యింది. వరుణ్ వరుసగా ఓవర్లలో పరాగ్, హసరంగను వెనక్కి పంపించాడు. జైస్వాల్, నితీశ్ ను మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో స్కోరు వేగంగా నెమ్మదిగా మారింది. వైభవ్ వేసిన 15 ఓవరులో చివరి బంతికి శుభమ్ దూబె భారీ షాట్ ఆడి రస్సెల్ కు చిక్కాడు. నిలకడగా ఆడుతున్న జురెల్ ను హెట్ మయర్ ను హర్షిత్ ఒకే ఓవర్ లో పెవిలియన్ కు పంపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవరులో ఆర్చర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Q for Quality, Q for Quinton ??
A sensational unbeaten 9⃣7⃣ runs to seal the deal ✅
Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/kbjY1vbjNL
— IndianPremierLeague (@IPL) March 26, 2025
Also Read: IPL 2025: దెబ్బ గట్టిగా పడింది.. స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








