KL Rahul Blessed Girl: తండ్రిగా కేఎల్‌ రాహుల్‌ ప్రమోషన్‌.. పండంటి పాపకు జన్మనిచ్చిన అతియా శెట్టి

KL Rahul And Athiya Shetty Blessed Baby Girl: భారత క్రికెట్‌కు.. బాలీవుడ్‌కు శుభవార్త వినిపించింది. స్టార్‌ కపుల్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి జోడీ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ వార్తతో రెండు రంగాలు ఆనందంలో మునిగాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 11:05 PM IST
KL Rahul Blessed Girl: తండ్రిగా కేఎల్‌ రాహుల్‌ ప్రమోషన్‌.. పండంటి పాపకు జన్మనిచ్చిన అతియా శెట్టి

KL Rahul Athiya Shetty: భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తండ్రిగా పదోన్నతి పొందాడు. అతడి భార్య ఆతియా శెట్టి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్‌ దంపతులు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ వార్తతో రాహుల్‌తోపాటు అతియా కుటుంబంలో సందడి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తోటి క్రికెటర్లు, సినీ ప్రముఖులతోపాటు ఇతర రంగాల ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐపీఎల్‌కు కొంత దూరంగా ఉన్న రాహుల్‌ ప్రస్తుతం తండ్రి అనుభూతి పొందుతున్నాడు.

Add Zee News as a Preferred Source

Also Read: Ishan Kishan IPL Century: BCCI చెంప చెల్లుమనిపించిన ఇషాన్‌.. ఇప్పటికైనా బోర్డు కళ్లు తెరుచుకుంటుందా?

24 మార్చ్‌ 2025 పాప జన్మించింది అంటూ రాహుల్‌, అతియా తమ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పంచుకున్నారు. కొలనులో రెండు హంసలు.. కమలం పూలతో ఉన్న ఫొటోను షేర్‌ చేసి తమ ఆనందాన్ని ప్రకటించుకున్నారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో అతియా ప్రసవం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌, అతియా తల్లిదండ్రులు కావడంతో అటు క్రికెట్‌ రంగంలోనూ.. ఇటు సినీ పరిశ్రమలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా వీరి జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక సునీల్‌ శెట్టి తాను తాత కావడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అయితే పాపకు సంబంధించిన ఫొటోను మాత్రం ఎవరూ పంచుకోలేదు. కోహ్లీ, రామ్‌ చరణ్‌ మాదిరి రాహుల్‌, అతియా కూడా పాప ఫొటోను బహిర్గత పరిచేందుకు ఇష్టపడడం లేనట్టు కనిపిస్తోంది. మీడియా కంట కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

Also Read: CSK Vs MI: తొలి మ్యాచ్ లోనే ముంబైకి షాక్.. చెన్నై విజయారంభం..

భారత అగ్ర శ్రేణి క్రికెటర్‌గా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌ 2023లో సినీ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె, హీరోయిన్‌ అతియా శెట్టిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారం రోజులపాటు వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. క్రీడాకారులతోపాటు సినీ ప్రముుఖులు కూడా తరలివచ్చారు. వివాహం అనంతరం కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమైన అనంతరం కీలకమైన మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న క్రమంలో తన భార్య ప్రసవానికి సంబంధించిన తేదీలు దగ్గరవచ్చాయి. దీంతో ఐపీఎల్‌ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక బ్యాటర్‌గా రాహుల్‌ ఉన్నాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం రూ.12 కోట్లకు రాహుల్‌ను కొనుగోలు చేసుకుంది. ఇక తండ్రి నటనకు వారసురాలిగా అతియా శెట్టి సినీ పరిశ్రమలో ఉంది. అడపదడపా సినిమాలు చేస్తోంది. హీరో, ముబారకన్‌, మోతీచూర్‌ చక్నాచూర్‌ అనే సినిమాల్లో అతియా హీరోయిన్‌గా నటించింది. తల్లి కావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News