IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 అట్టహాసంగా ముగిసింది. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ గెఇచి చరిత్ర సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఐపీఎల్ ముగియగా నెలన్నర పాటు వినోదాన్ని అందించిన ఆఖరి రోజును అమితమైన వినోదం పంచింది. ముగింపు వేడుకలో అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. ఇక ఏ బ్యాటర్‌కు ఏ అవార్డు వచ్చింది? ఎంత నగదు బహుమతి పొందారు? గెలిచిన జట్టుకు, ఓడిన టీమ్‌కు ఎంత బహుమతి లభించిందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Also Read: IPL 2025 RCB Vs PBKS: ఐపీఎల్ 2025 ట్రోఫీ కోసం బెంగళూరు, పంజాబ్ హోరాహోరీ.. లక్ష్యం 190
విజేత, రన్నరప్‌లకు
ఐపీఎల్ ప్రైజ్ మనీలో మూడేళ్ల నుంచి బీసీసీఐ ఎలాంటి మార్పు చేయలేదు. ప్రైజ్ మనీలో మార్పులు చివరిసారి 2022లో జరిగాయి. ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అందించిన నగదు బహుమతి అక్షరాల రూ.20 కోట్లు. ఇక పోరాడి ఓడిన రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ.13.5 కోట్లు బహుమతిగా లభించాయి.
క్వాలిఫయర్, ఎలిమినేటర్‌కు
క్వాలిఫయర్-2 నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ.7 కోట్ల నగదు ప్రోత్సాహకం దక్కుతుంది. ఎలిమినేటర్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్ల నగదు బహుమతి అందిస్తారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వంటి అవార్డులకు ఐపీఎల్‌లో నగదు బహుమతి అందించారు.
Also Read: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ టాప్ 10 ముఖ్యాంశాలు.. తొలి విజేత ఎవరో తెలుసా?
ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్‌కు రూ.10 లక్షలు పొందాడు. 759 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ నిలిచాడు.
పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ రూ.10 లక్షలు అందుకున్నాడు. 25 వికెట్లు తీసి ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ నిలిచాడు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ రూ.20 లక్షలు అందుకున్నాడు.
సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు: సూర్య కుమార్ యాదవ్ రూ.10 లక్షలు గెలుచుకున్నాడు. ముంబై ఇండియన్స్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్/ సిరీస్: సాయి సుదర్శన్‌కు రూ.10 లక్షలు అందించారు.
ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు రూ.10 లక్షలు
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ రూ.10 లక్షలు
ఫెయిర్ ప్లే అవార్డు విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. కానీ ఈ సీజన్‌లో అత్యధిక ఓటములతో అట్టడుగున చెన్నై నిలవడం కలచివేసే అంశం.
క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును కమిండు మెండిస్ సొంతం చేసుకున్నాడు.
సూపర్ స్ట్రైకర్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అవార్డు అందుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









