Kohli Centuries In Career: సచిన్ 100 సెంచరీల రికార్డుపై కన్నేసిన కోహ్లీ..ఇంకెన్ని శతకాలు చేస్తే ఆ రికార్డు సాధిస్తాడు?

Kohli Sachin Century Comparison: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 84వ సెంచరీకి చేరుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ సాధించిన 100 సెంచరీలను సాధించాలంటే కోహ్లీ ఇంకా ఎన్ని శతకాలు నమోదు చేయాల్సి ఉంటుందో తెలుసా? 

Written by - Harish Darla | Last Updated : Dec 4, 2025, 04:09 PM IST
Kohli Centuries In Career: సచిన్ 100 సెంచరీల రికార్డుపై కన్నేసిన కోహ్లీ..ఇంకెన్ని శతకాలు చేస్తే ఆ రికార్డు సాధిస్తాడు?

Kohli Sachin Century Comparison: రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో వరుసగా రెండో సెంచరీతో తన ఖాతాలో 53వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం విరాట్ కోహ్లీకి ఇది 84వ సెంచరీ. మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ సాధించిన 100 సెంచరీలను సాధించాలంటే కోహ్లీ 16 శతకాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం తరఫున వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ, సచిన్ రికార్డును సమం చేయడమే కాకుండా దాన్ని అధిగమించే అవకాశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

Add Zee News as a Preferred Source

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..

ఆటగాడు దేశం మ్యాచ్‌లు సెంచరీలు
సచిన్ టెండూల్కర్ భారత్ 664 100
విరాట్ కోహ్లీ భారత్ 555 84
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 560 71
కుమార సంగక్కర శ్రీలంక 594 63
జాక్వెస్ కల్లిస్ దక్షిణాఫ్రికా 519 62

శనివారం (డిసెంబర్ 6)న వైజాగ్‌లో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో వన్డే ఆడతాడు. టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కారణంగా.. అంతర్జాతీయంగా విరాట్ కోహ్లీ కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. దీంతో కొద్ది మ్యాచ్‌లు మాత్రమే అతను ప్రాతనిధ్యం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఆ తర్వాత వచ్చే ఏడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. 

Also Read: School Holiday: దిత్వా తుపాను అల్లకల్లోలం..వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు..పండగ చేసుకోండి గురూ!

వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లాండ్ సిరీస్, భారతదేశం కనీసం ఆరు లీగ్ మ్యాచ్‌లు ఆడే 2027 వన్డే ప్రపంచ కప్ మధ్య.. భారతదేశం ఆసియా కప్‌తో పాటు రెండు స్వదేశీ సిరీస్‌లను ఆడుతుంది. అంటే కోహ్లీ 16 సెంచరీలు సాధించడానికి.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డును చేరుకునేందుకు విరాట్ కోహ్లీకి మరో 20 మ్యాచ్‌లు వరకు అవకాశం ఉంటుందని అంచనా. అయితే  20 మ్యాచ్‌లలో 17 సెంచరీలు చేయడం ఏ ఆటగాడికైనా చాలా కష్టమైన పని, కానీ అది అసాధ్యం అయితే కాదు.

ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కోహ్లీ వన్డే రికార్డు
కోహ్లీ ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో 33 వన్డేలు ఆడాడు. ఆ 33 మ్యాచ్‌లలో అతను ఆరు సెంచరీలు చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో కివీస్‌పై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించాడు. అదే విధంగా ఇంగ్లాండ్‌లో కోహ్లీ ఇప్పటివరకు 33 వన్డేలు ఆడాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఇంగ్లాండ్‌లో అతని ఏకైక వన్డే సెంచరీ 2011లో వచ్చింది. సెప్టెంబర్ 16, 2011న కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో, అతను ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 4వ స్థానంలో బ్యాట్స్‌మన్‌గా 93 బంతుల్లో 107 పరుగులు చేశాడు.

పురుషుల వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు సెంచరీలు చేశాడు. ఆ ఐదు సెంచరీలలో.. విరాట్ కేవలం 2023 ప్రపంచకప్ ఎడిషన్‌లోనే అత్యధికంగా మూడు సెంచరీలు చేశాడు. ఇది ఆ ఏడాది అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారతదేశం వేదికగా వరల్డ్ కప్ జరిగింది.

Also Read: Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో పెళ్లి..ఎట్టకేలకు స్పందించిన రష్మిక..పెళ్లి పనులు మొదలైనట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News