)
Kohli Test Cricket Comeback Request: టీమ్ఇండియా లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులను సాధించి.. ఇప్పుడు టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని అప్పటి అధికారులు టెస్టుల్లో రిటైర్మెంట్ ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చినట్లు ఆయన సన్నిహితులు తాజాగా చెప్పుకొచ్చారు. కేవలం కొందరు అప్పటి బీసీసీఐలో అధికారులు, కోచ్, చీఫ్ సెలెక్టర్ వల్ల ఆయన టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సిందేనని పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం సహా టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయినట్లు ఉంది.
టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని తిరిగి టెస్టు జట్టులోకి ఆహ్వానించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు కోహ్లీని కోరనున్నారట. ఇదే విషయమై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
గత కొన్ని సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని అనుభవం ఉన్న కెప్టెన్, టెస్టు స్పెషలిస్టుగా కోహ్లీ అయితే జట్టును గాఢిలో పెడతాడనే నమ్మకంగా బీసీసీఐ ఎదురుచూస్తుంది. టీమ్ఇండియా టెస్టు ఫార్మాట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విరాట్ కోహ్లీని తిరిగి టెస్టు జట్టులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీసీసీఐ కోరితే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో న్యూజిలాండ్ జట్టుతో సహా ఇటీవలే దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో టీమ్ఇండియా వైట్ వాష్ కావడం వల్ల టీమ్ఇండియా ఆటగాళ్లు, కోచ్, మేనేజ్మెంట్, సెలెక్టర్లు, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కోచ్ గంభీర్‌కు టెస్టు జట్టును గాఢిన పెట్టే చర్య సజావుగా జరగడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కోచ్‌గా గంభీర్ అనవసర ప్రయోగాలను దిగుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
దీంతో కోహ్లీ, రోహిత్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. టెస్టు ఫార్మాట్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండడం ఎంతో ముఖ్యమని బీసీసీఐ భావిస్తోంది. అయితే టెస్టు స్పెషలిస్టు పుజారాకు విశ్రాంతి ఇవ్వడం సహా అజింక్య రహానెను జట్టుకు దూరం చేసినట్లు తెలిసిన విషయమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook