India Vs Australia Live Cricket Score Updates: ఛాంపియన్ ట్రోఫీలో నేడు కీలక సమరం జరగనుంది. వరుస హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో సెమీస్‌కు చేరుకున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. అటు కంగారూ జట్టు కేవలం బ్యాటింగ్ మీదే ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక మ్యాచ్‌లో గెలుపొందగా.. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 2 గంటలకు టాస్ వేయనున్నారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









