India Vs New Zealand Live Score Updates: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. తుదిపోరులో న్యూజిలాండ్‌ను ఓడించి కప్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకోగా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్ పోరులోనూ అదే ఆటతీరును కనబర్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కివీస్.. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.230 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









