Add Zee Business As A Preferred Source
App
Live Now

IND Vs PAK Asia Cup 2025 Highlights: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్.. ఆసియా కప్‌లో గ్రాండ్ విక్టరీ

 IND VS PAK Asia Cup 2025 LIVE Updates: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. పహల్గామ్ దాడి తరువాత రెండు జట్లు తొలిసారి తలపడుతుండడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IND Vs PAK Asia Cup 2025 Highlights: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్.. ఆసియా కప్‌లో గ్రాండ్ విక్టరీ
Image Credit: IND vs PAK Live Score Updates
14 September 2025 11:22 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (47 నాటౌట్) సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. అభిషేర్ శర్మ (31), తిలక్ వర్మ (31) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్‌ ఒక్కడే మూడు వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు తేలిపోయారు.

14 September 2025 11:19 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: ఆసియా కప్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది.

14 September 2025 11:12 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 15 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 123 రన్స్ చేసింది. మరో ఐదు పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.

14 September 2025 11:04 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: స్పిన్నర్ సైమ్ అయూబ్‌ మూడో వికెట్ తీశాడు. తిలక్ వర్మ (31)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. భారత్ స్కోరు: 100/3 (13).

14 September 2025 11:00 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 12 ఓవర్ల ఆట ముగిసింది. భారత్ రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (23), తిలక్ వర్మ (31) నిలకడగా ఆడుతున్నారు.

14 September 2025 10:48 PM (IST)

IND Vs PAK Asia Cup 2025 LIVE Score: భారత్ విజయానికి మరింత చేరువ అవుతోంది. పది ఓవర్లలో 88 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ (17), తిలక్ వర్మ (28) క్రీజ్‌లో ఉన్నారు. మరో 40 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.

14 September 2025 10:40 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 70 రన్స్ చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే.. 74 బంతుల్లో 58 పరుగులు చేయాలి.

14 September 2025 10:33 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: పవర్ ప్లే ముగిసింది. భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 రన్స్ చేసింది. క్రీజ్‌లో సూర్య కుమార్ యాదవ్ (3), తిలక్ వర్మ (15) ఉన్నారు. టీమిండియా విజయానికి 84 బంతుల్లో 67 పరుగులు కావాలి.

14 September 2025 10:24 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 13 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సైమ్ అయూబ్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. స్కోరు: 42-2 (4).

14 September 2025 10:13 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: రెండో ఓవర్‌లోనే పాకిస్థాన్ స్పిన్నర్ సైమ్ అయూబ్‌ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10) స్టంప్ ఔట్ అయ్యాడు. భారత్ స్కోరు: 22/1 (2).

14 September 2025 09:49 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live Score Updates: షాహీన్ ఆఫ్రిది కేవలం 16 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లేకపోతే పాక్ ఇన్నింగ్స్ వంద పరుగులలోపే ముగిసేది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్థిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తికి ఒక్కో వికెట్ దక్కింది.

14 September 2025 09:45 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: షాహీన్ ఆఫ్రిది ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. 128 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
 

14 September 2025 09:40 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ముఖ్వీమ్ రెండు బౌండరీలు బాదగా.. చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పాక్ స్కోరు: 111-9 (19).

14 September 2025 09:34 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 18వ ఓవర్‌లో పాకిస్థాన్ 8వ వికెట్ కోల్పోయింది. షాహీమ్ అష్రఫ్‌ (11)ను వరుణ్‌ చక్రవర్తి ఎల్బీడబ్ల్యూ చేశాడు. స్కోరు: 99-8 (18)

14 September 2025 09:28 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ కీలక వికెట్ తీశాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్ ఫర్హాన్ (40)ను ఔట్ చేశాడు. స్కోరు: 90/7 (17).

14 September 2025 09:18 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 15 ఓవర్ల ఆట ముగిసింది. 78 పరుగులకు పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఫర్హాన్ (38) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. స్కోరు: 78/6 (15).

14 September 2025 09:10 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: 13వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్‌ను చావుదెబ్బ తీశాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీంతో 65 పరుగులకే పాక్ ఆరు వికెట్లు కోల్పోయింది. 

14 September 2025 09:02 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో మాత్రం ఓపెనర్ ఫర్హాన్ (32) చక్కగా ఆడుతున్నాడు. స్కోరు: 62/4 (12)

14 September 2025 08:56 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: పది ఓవర్ల ఆట ముగిసింది. పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా (3)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.

14 September 2025 08:45 PM (IST)

India Vs Pakistan Asia cup 2025 Live score Updates: కోలుకున్నట్లే కనిపించిన పాకిస్థాన్‌కు అక్షర్ పటేల్ షాకిచ్చాడు. ఫఖర్ జమాన్ (17) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. తిలక్ వర్మ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు: 45-3

14 September 2025 08:37 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో ఫర్హాన్ ఓ సిక్సర్ బాదాడు. పవర్ ప్లే (ఆరు ఓవర్లు) ముగిసింది. పాకిస్థాన్ స్కోరు: 42/2 (6).

14 September 2025 08:29 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఫఖర్ జమాన్ (16), సాహిబ్జాదా ఫర్హాన్ (11) ఉన్నారు.

14 September 2025 08:20 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: మూడో ఓవర్‌లో పాకిస్థాన్ కాస్త దూకుడు పెంచింది. ఫఖర్ జమాన్ రెండు బౌండరీ బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 20/2 (3).

14 September 2025 08:10 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: పాకిస్థాన్‌కు బుమ్రా మరో దెబ్బ తీశాడు. రెండో ఓవర్ రెండో బంతికి మరో వికెట్ తీశాడు. మహ్మద్ హరిస్ (3) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. పాండ్యా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 

14 September 2025 08:07 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: తొలి బంతికే హార్థిక్ పాండ్యా పాకిస్థాన్‌కు షాకిచ్చాడు. ఓపెనర్ సైమ్ అయూబ్‌ను డకౌట్ చేశాడు. పాయింట్‌లో బుమ్రా క్యాచ్ అందుకున్నాడు. తొలి ఓవర్‌లో మొత్తం ఐదు పరుగులు వచ్చాయి.

14 September 2025 07:51 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: "మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. టాస్ ఓడిన సంతోషంగా ఉన్నాము. మంచి వికెట్ ఉంది. రాత్రి బ్యాటింగ్ చేయడం మంచిది. పిచ్ తేమగా ఉంటుంది కాబట్టి కొంత మంచు ఉంటుందని ఆశిస్తున్నాము. అదే జట్టుతో ఆడుతున్నాం.." అని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

14 September 2025 07:46 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: "ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. మేము మంచి క్రికెట్ ఆడుతున్నాము. ఈ మ్యాచ్‌కు చాలా ఉత్సాహంగా ఉన్నాం. వికెట్ నెమ్మదిగా  కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డు మీద పరుగులు చేయాలనుకుంటున్నాము. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడుతున్నాం. 20 రోజులుగా ఇక్కడే ఉన్నాను. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాము.." అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు.

14 September 2025 07:37 PM (IST)

IND vs Pak Asia cup 2025 live score Updates: పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

14 September 2025 07:35 PM (IST)

IND vs Pak Asia cup 2025 Live Score Updates: టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది.

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.