Add Zee Business As A Preferred Source
App
Live Now

India Vs Pakistan Live Cricket Score: తిలక్ వర్మ ది రియల్ హీరో.. పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

Ind Vs Pak Asia Cup Final 2025 Live Match Updates: ఆసియా కప్ లో దయాది పాక్‌తో టీమిండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో, సూపర్ 4లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. హ్యాట్రిక్ విజయం సాధించి విజేతగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. లైవ్ స్కోర్  అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 India Vs Pakistan Live Cricket Score: తిలక్ వర్మ ది రియల్ హీరో.. పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
Image Credit: India Vs Pakistan Live Cricket Score
29 September 2025 12:36 AM (IST)

India Vs Pakistan Asia Cup Final 2025 Highlights: అమరావతి: టీమ్ ఇండియాకు సీఎం...

India Vs Pakistan Asia Cup Final 2025 Highlights: అమరావతి: టీమ్ ఇండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్:

- టీమ్ ఇండియా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో  పాకిస్తాన్ పై సాధించిన విజయం అద్భుతమైంది.

- టీమ్ ఇండియాకు అభినందనలు.

- టీంవర్క్ తో,  అంకితభావంతో స్పూర్తినిచ్చేలా ఆడిన టీమిండియా ఆసియా కప్ చేజిక్కించుకుంది.

- దేశం గర్వించదగ్గ క్షణాలివి.

- ఇండియన్ క్రికెట్ లో ఈ గెలుపు ఓ అద్భుతమైన ఘట్టం.

29 September 2025 12:35 AM (IST)

India Vs Pakistan Asia Cup Final 2025 Highlights: ఆసియా కప్ విజేత గా నిలిచిన...

India Vs Pakistan Asia Cup Final 2025 Highlights: ఆసియా కప్ విజేత గా నిలిచిన భారత్ టీం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.  పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన  తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో మన తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు.. గౌరవం తెచ్చారని అభినందనలు తెలిపారు.

29 September 2025 12:33 AM (IST)

...

29 September 2025 12:07 AM (IST)

India Vs Pakistan Live Score Updates: తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69 నాటౌట్)...

India Vs Pakistan Live Score Updates: తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69 నాటౌట్) రియల్ హీరోగా మారాడు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన తిలక్.. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో తీవ్ర ఒత్తిడి నెలకొన్నా.. ఎలాంటి మిస్టేక్ చేయకుండా భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. 

29 September 2025 12:04 AM (IST)

India Vs Pakistan Live Score Updates: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా...

India Vs Pakistan Live Score Updates: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పాకిస్థాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 

28 September 2025 11:57 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 19వ ఓవర్ చివరి బంతికి శివమ్ దూబే (33)...

India Vs Pakistan Live Score Updates: 19వ ఓవర్ చివరి బంతికి శివమ్ దూబే (33) ఔట్ అయ్యాడు. 6 బంతుల్లో 10 పరుగులు చేస్తే భారత్ గెలుపొందుతుంది. 

28 September 2025 11:44 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 18వ ఓవర్లో రవూఫ్ 13 పరుగులు ఇచ్చాడు....

India Vs Pakistan Live Score Updates: 18వ ఓవర్లో రవూఫ్ 13 పరుగులు ఇచ్చాడు. ఫస్ట్ ఐదు బంతులు చక్కగా వేసిన రవూఫ్.. చివరి బంతిని ఫుల్ టాస్ వేయగా దూబే సిక్సర్ గా మలిచాడు. దీంతో సమీకరణ 12 బంతుల్లో 17 పరుగులుగా మారింది.

28 September 2025 11:37 PM (IST)

India Vs Pakistan Live Score Updates: షాహీన్ ఆఫ్రిది వేసిన 17వ ఓవర్లో కేవలం...

India Vs Pakistan Live Score Updates: షాహీన్ ఆఫ్రిది వేసిన 17వ ఓవర్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంత్ మరింత ఉత్కంఠగా మారింది. 18 బంతుల్లో 30 రన్స్ చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.

28 September 2025 11:31 PM (IST)

India Vs Pakistan Live Score Updates: తిలక్ వర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ...

India Vs Pakistan Live Score Updates: తిలక్ వర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 36 రన్స్ చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. స్కోరు 111/4 (16).

28 September 2025 11:27 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 15 ఓవర్ల ఆట ముగిసింది. భారత్ విజయానికి...

India Vs Pakistan Live Score Updates: 15 ఓవర్ల ఆట ముగిసింది. భారత్ విజయానికి 30 బంతుల్లో 47 పరుగులు కావాలి. క్రీజ్ లో తిలక్ వర్మ (48), శివమ్ దూబే (10) ఉన్నారు. రవూఫ్ వేసిన 15వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.

28 September 2025 11:16 PM (IST)

India Vs Pakistan Live Score Updates: కోలుకుంటున్న సమయంలో భారత్ కు షాక్...

India Vs Pakistan Live Score Updates: కోలుకుంటున్న సమయంలో భారత్ కు షాక్ తగిలింది. చక్కటి షాట్లతో అలరిస్తున్న సంజూ శాంసన్ (24)ను అబార్ ఔట్ చేశాడు. భారత్ స్కోరు: 78/4 (13).

28 September 2025 11:11 PM (IST)

India Vs Pakistan Live Score Updates: తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరు నాలుగో...

India Vs Pakistan Live Score Updates: తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరు నాలుగో వికెట్ కు 56 పరుగులు జోడించారు. టీమిండియా స్కోరు 12 ఓవర్లలో 76 పరుగులకు చేరుకుంది. 48 బంతుల్లో 71 రన్స్ కావాలి.

28 September 2025 11:01 PM (IST)

India Vs Pakistan Live Score Updates: పది ఓవర్ల ఆట ముగిసింది. తిలక్ వర్మ (24)...

India Vs Pakistan Live Score Updates: పది ఓవర్ల ఆట ముగిసింది. తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) నిలకడగా ఆడుతుండడంతో భారత్ కాస్త కోలుకుంది. 60 బంతుల్లో 89 రన్స్ చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది.

28 September 2025 10:56 PM (IST)

...

India Vs Pakistan Live Score Updates:  9వ ఓవర్ లో సంజూ శాంసన్ కు బిగ్ లైఫ్ లభించింది. సులభమైన క్యాచ్ ను పాకిస్థాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. 9 ఓవర్లలో భారత్ స్కోరు54/3.

28 September 2025 10:52 PM (IST)

India Vs Pakistan Live Score Updates:  త్వరగా మూడు వికెట్లు కోల్పోయినా.....

India Vs Pakistan Live Score Updates:  త్వరగా మూడు వికెట్లు కోల్పోయినా.. తిలక్ వర్మ (20), సంజూ శాంసన్ (11) ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోరు: 49/3 (8).

28 September 2025 10:44 PM (IST)

India Vs Pakistan Live Score Updates: పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో మూడు...

India Vs Pakistan Live Score Updates: పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 36 పరుగులు చేసింది. 84 బాల్స్‌లో 111 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.

28 September 2025 10:36 PM (IST)

India Vs Pakistan Live Score Updates: శుభ్‌మన్ గిల్ (12) చెత్త ఫామ్ కంటిన్యూ...

India Vs Pakistan Live Score Updates: శుభ్‌మన్ గిల్ (12) చెత్త ఫామ్ కంటిన్యూ అవుతోంది. అష్రఫ్ బౌలింగ్ లో అనవసరంగా షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. భారత్ స్కోరు: 20-3 (4).

28 September 2025 10:27 PM (IST)

India Vs Pakistan Live Score Updates: భారత్ ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్...

India Vs Pakistan Live Score Updates: భారత్ ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1)ను షహీన్ ఆఫ్రిది ఔట్ చేశాడు. సల్మాన్ అఘా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. రెండు వికెట్లు కోల్పోవడంతో మిడిల్ ఆర్డర్ ఎలా ఆడనుందో చూడాలి. భారత్ స్కోరు:  11/2 (2.5)

28 September 2025 10:15 PM (IST)

India Vs Pakistan Live Score Updates: భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్...

India Vs Pakistan Live Score Updates: భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ (5) రెండో ఓవర్ లోనే వికెట్ సమర్పించుకున్నాడు. అష్రఫ్ బౌలింగ్ లో రవూఫ్ కు క్యాచ్ ఇచ్చాడు. భారత్ స్కోరు: 10/1 (2).

28 September 2025 10:10 PM (IST)

...

India Vs Pakistan Live Score Updates: తొలి ఓవర్‌లో టీమిండియా 7 పరుగులు వచ్చాయి. 140 రన్స్ చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.

28 September 2025 09:51 PM (IST)

India Vs Pakistan Live Score Updates: కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో...

India Vs Pakistan Live Score Updates: కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్స్ మెన్లు మొత్తం పెవిలియన్ కు క్యూ కట్టారు. 147 పరుగుల టార్గెట్ తో భారత్ బరిలోకి దిగనుంది.

28 September 2025 09:47 PM (IST)

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ కుప్పకూలింది. గొప్పగా...

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ కుప్పకూలింది. గొప్పగా ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే టీమిండియా స్పిన్నర్ల దూకుడుతో 146 పరుగులకే ఆలౌట్ అయింది.

28 September 2025 09:37 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 18వ ఓవర్ లో పాకిస్థాన్ మరో వికెట్...

India Vs Pakistan Live Score Updates: 18వ ఓవర్ లో పాకిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. హరీస్ రవూఫ్ (6)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్కోరు: 141/9 (18).

28 September 2025 09:35 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 17వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్...

India Vs Pakistan Live Score Updates: 17వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కేవలం ఒక పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 

28 September 2025 09:22 PM (IST)

...

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. తలత్ (1)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. పాక్ స్కోరు: 133-5 (16).

28 September 2025 09:16 PM (IST)

India Vs Pakistan Live Score Updates: స్కోరు పెంచే క్రమంలో పాక్ వికెట్లు...

India Vs Pakistan Live Score Updates: స్కోరు పెంచే క్రమంలో పాక్ వికెట్లు కోల్పోతుంది. క్రీజ్ లో పాతుకుపోయిన ఫఖర్ జమాన్ (46)ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు పంపించాడు. పాక్ స్కోరు: 128-4 (15).

28 September 2025 09:10 PM (IST)

...

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ కు ఈసారి అక్షర్ పటేల్ షాకిచ్చాడు. హరీస్ (0)ను డకౌట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద రింకూ సింగ్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ సల్మాన్ అఘా క్రీజ్ లోకి రాగా.. ఓపెనర్ ఫఖర్ జమాన్ (38) నిలకడగా ఆడుతున్నాడు. పాక్ స్కోరు 118-3 (14).

28 September 2025 09:06 PM (IST)

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది....

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. సైమ్ అయూబ్ (14)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. పాక్ స్కోరు: 113/2 (13).

28 September 2025 08:59 PM (IST)

India Vs Pakistan Live Score Updates: 12 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్...

India Vs Pakistan Live Score Updates: 12 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టానికి పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్ లో ఉన్నారు. 

28 September 2025 08:48 PM (IST)

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ జోరుకు ఎట్టకేలకు వరుణ్...

India Vs Pakistan Live Score Updates: పాకిస్థాన్ జోరుకు ఎట్టకేలకు వరుణ్ చక్రవర్తి బ్రేక్ వేశాడు. హాఫ్ సెంచరీ తరువాత సిక్సర్ బాది ఊపు మీదున్న ఫర్హాన్ (57) మరోషాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. పాక్ స్కోరు 84-1 (9.4).

28 September 2025 08:43 PM (IST)

India Vs Pakistan Live Score Updates: ఓపెనర్ ఫర్హాన్ (51) హాఫ్ సెంచరీ పూర్తి...

India Vs Pakistan Live Score Updates: ఓపెనర్ ఫర్హాన్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ (22) చక్కటి సహకారం అందిస్తున్నాడు. పాక్ స్కోరు 77-0 (9).

28 September 2025 08:38 PM (IST)

India Vs Pakistan Live Score Updates:  పాకిస్థాన్ బ్యాటింగ్ లో జోరు...

India Vs Pakistan Live Score Updates:  పాకిస్థాన్ బ్యాటింగ్ లో జోరు పెంచింది. ఫర్హాన్ (47) బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. 64-0 (8).

28 September 2025 08:31 PM (IST)

India Vs Pakistan Live Score Updates:  పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో...

India Vs Pakistan Live Score Updates:  పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్ (12), ఫర్హాన్ (31) నిలకడగా ఆడుతున్నారు.

28 September 2025 08:27 PM (IST)

India Vs Pakistan Live Score Updates:  ఐదో ఓవర్ లో స్పిన్నర్ వరుణ్...

India Vs Pakistan Live Score Updates:  ఐదో ఓవర్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దింపాడు. ఈ ఓవర్ లో ఐదు పరుగులువచ్చాయి. పాక్ స్కోరు 37/0 (5).

28 September 2025 08:16 PM (IST)

...

India Vs Pakistan Live Score Updates: బుమ్రా వేసిన రెండో ఓవర్ లో  7 పరుగులు వచ్చాయి. శివమ్ దుబే మూడో ఓవర్ లో 8 రన్స్ వచ్చాయి. స్కోరు: 19/0 (3).

28 September 2025 08:05 PM (IST)

India Vs Pakistan Live Score Updates: హార్దిక్ పాండ్యా దూరం కావడంతో శివమ్...

India Vs Pakistan Live Score Updates: హార్దిక్ పాండ్యా దూరం కావడంతో శివమ్ దూబే తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ కొత్త బంతితో బౌలింగ్ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులు డాట్ వేయగా.. ఐదో బంతికి బౌండరీ వెళ్లింది. చివరి బంతి డాట్ అయింది.

28 September 2025 07:37 PM (IST)

India Vs Pakistan Live Score Updates: తుది జట్లు: ...

India Vs Pakistan Live Score Updates: తుది జట్లు: 

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
 
 పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ 

28 September 2025 07:35 PM (IST)

India Vs Pakistan Live Score Updates: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్...

India Vs Pakistan Live Score Updates: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు.

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More