
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: ఈ మ్యాచ్ లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ కంటిన్యూ చేశారు. విజయం అనంతరం తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా పాక్ ప్లేయర్లకు షేక్ ఇవ్వకుండా వచ్చేశారు.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాకిస్థాన్‌కు భారత్ పవర్‌ఫుల్ పంచ్ ఇచ్చింది. సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మ (74), (47), తిలక్ వర్మ (30 నాటౌట్) రాణించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: 18వ ఓవర్లో తిలక్ వర్మ ఓ సిక్సర్ బాదడంతో మొత్తం 10 పరుగులు వచ్చాయి. 12 బంతుల్లో 9 పరుగులు చేస్తే పాక్ చిత్తవుతుంది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్ లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోరు 17 ఓవర్లలో 153 పరుగులు కాగా.. విజయానికి 18 బంతుల్లో 19 రన్స్ కావాలి.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 30 బంతుల్లో 32 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మ భారీ షాట్ కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ క్రీజ్ లోకి వచ్చాడు. భారత్ విజయానికి 42 బంతుల్లో 46 రన్స్ కావాలి. స్కోరు: 126/3 (13).
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: శుభ్ మన్ గిల్ (47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అష్రఫ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ (58), తిలక్ వర్మ (0) క్రీజ్ లో ఉన్నారు. భారత్ స్కోరు: 106/2 (11).
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: 9.4 ఓవర్లలో భారత్ స్కోరు 105 పరుగులకు చేరుకుంది. 62 బంతుల్లో 67 రన్స్ చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: టీమిండియా ఓపెనర్లు పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అభిషేక్ శర్మ (53), శుభ్ మన్ గిల్ (53) బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. దీంతో భారత్ స్కోరు 8 ఓవర్లలోనే 96 రన్స్ కు చేరుకుంది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాక్ బౌలర్ల కవ్వింపునకు అభిషేక్, గిల్ బ్యాట్ తో సమాధానం ఇస్తున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ చితక్కొడుతున్నారు. స్కోరు: 69/0 (6).
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: ఓపెనర్ల దూకుడుతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ఐదో ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 55 పరుగులకు చేరుకుంది. అభిషేక్ శర్మ (28), శుభ్ మన్ గిల్ (27) అదగొడుతున్నారు.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నారు. ముఖ్యంగా గిల్ బౌండరీలు వర్షం కురిపిస్తున్నాడు. స్కోరు: 31/0 (3)
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ (58) హాఫ్ సెంచరీ చేయగా.. ఆయూబ్ (21), నవాజ్ (21), ఆఖర్లో అష్రఫ్ 8 బంతుల్లో 20 పరుగులు చేసి పాక్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 172 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో 14 వచ్చాయి.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: బుమ్రా వేసిన 19వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మూడో బంతికి నవాజ్ రనౌట్ అవ్వగా.. తరువాతి బంతికి ఫహీమ్ సిక్సర్ బాదాడు.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: 18 ఓవర్ల ఆట ముగిసింది. నాలుగు వికెట్ నష్టానికి పాక్ 146 రన్స్ చేసింది.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ సాధించి జోరు మీదున్న ఫర్హాన్ (58) శివమ్ దుబే బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు.
India VS Pakistan Asia Cup 2025 LIVE Updates: పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హుస్సేన్ తలత్ (10) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్కోరు: 115/3 (14).
India vs Pakistan Live Score Updates: 13 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. ఫర్హాన్ (58), హుస్సేన్ తలత్ (10) క్రీజ్ లో ఉన్నారు.
India vs Pakistan Live Score Updates: శివమ్ దుబే టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆయూబ్ (21) భారీ షాట్ కు యత్నించగా.. అభిషేక్ శర్మ పరుగెత్తుకుంటూ వచ్చి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. పాక్ స్కోరు: 96/2 (11).
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: పది ఓవర్ల ఆట ముగిసింది. వికెట్ నష్టానికి పాక్ 91 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆయూబ్ (21) కూడా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. స్కోరుకార్డు: 91-1 (10).
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ జోరు తగ్గడం లేదు. ఫర్హాన్ (39), ఆయూబ్ (13) దూకుడుగా ఆడుతున్నారు. స్కోరు: 70/1 (8).
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సైమ్ ఆయూబ్ స్వీప్ షాట్ ఆడగా.. కుల్దీప్ యాదవ్ సులభమైన క్యాచ్ ను వదిలిపెట్టాడు. మరోవైపు బుమ్రా ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. పవర్ ప్లే ముగిసేసమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. బుమ్రా మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: పాకిస్థాన్ దూకుడుగా ఆడుతోంది. నాలుగు ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 36 రన్స్ చేసింది.
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: హార్ధిక్ పాండ్యా తొలి దెబ్బ తీశాడు. దూకుడు మీదున్న ఫఖర్ జమాన్ (15)ను పెవిలియన్ కు పంపించాడు.
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్ లో పాకిస్థాన్ ఆరు పరుగులు చేసింది.
India vs Pakistan Asia Cup 2025 Live Score Updates: ఈసారి కూడా టాస్ సమయంలో భారత్ కెప్టెన్ సూర్య కుమార్ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ నెల 14న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లోనూ సూర్య.. పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు రాద్ధాంతం చేసింది. కాగా ఈ మ్యాచ్లో తాము గెలిస్తే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసేందుకు పాక్ సిద్ధమైనట్లు టాక్.
Asia Cup 2025. PAKISTAN XI: S. Ayub, S. Farhan, M. Haris (wk), F. Zaman, S. Ali Agha (c), F. Ashraf, H. Talat, M. Nawaz, A. Ahmed, S. Afridi, H. Rauf. https://t.co/CNzDX2HKll #INDvPAK #AsiaCup2025 #Super4
— BCCI (@BCCI) September 21, 2025
India vs Pakistan Asia Cup 2025 Playing 11: భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
India vs Pakistan Asia Cup 2025 Live Updates: రెండు జట్లు కూడా తుది జట్లలో రెండు మార్పులు చేశాయి. అర్ష్ దీప్ సింగ్, హర్షీత్ రాణా స్థానంలో బుమ్రా, వరుణ్ చక్రవర్తి టీమ్ లోకి వచ్చారు.
India vs Pakistan Asia Cup 2025 Live Updates: టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ ఆరంభించనుంది.
India vs Pakistan Asia Cup 2025 Live Updates: ఆసియా కప్ 2025లో నేడు మరో సూపర్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. దయాది పాకిస్థాన్‌తో భారత్ మరోసారి తలపడనుంది. గ్రూప్ దశలో పాక్‌ను భారత్ చిత్తు చేయగా.. ఇవాళ్టి మ్యాచ్లో డబుల్ పంచ్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియా వరుస విజయాలతో గ్రూప్ టాపర్ గా సూపర్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ చేతిలో ఓటమి.. యూఏఈ, ఒమన్ జట్లపై విజయాలతో పాకిస్థాన్ సూపర్ 4 చేరింది. నో షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై హై ఓల్టేజ్ నెలకొంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండగా.. అక్షర్ పటేల్ గాయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అటు పాకిస్థాన్ కూడా కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య లైవ్ సోర్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.