Add Zee Business As A Preferred Source
App
Live Now

CSK Vs SRH Live Score: చెపాక్‌లో చెన్నైకు SRH చెక్.. ప్లే ఆఫ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ

Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Score Updates: చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరుగుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకంగా మారింది. CSK Vs SRH Live Score Updates కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

CSK Vs SRH Live Score: చెపాక్‌లో చెన్నైకు SRH చెక్.. ప్లే ఆఫ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ
Image Credit: CSK Vs SRH Live Score Updates (Source: X)
18 May 2026 11:39 PM (IST)

CSK vs SRH Live Score Updates: చెపాక్‌లో చెన్నైకు సన్‌రైజర్స్ హైదరాబాద్ చెక్ పెట్టింది. 181 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్‌తోపాటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

18 May 2026 11:33 PM (IST)

CSK vs SRH Live Score Updates: విజయానికి ఆరు పరుగుల దూరంలో ఇషాన్ కిషన్ (70) ఔట్ అయ్యాడు. కాంబోజ్ బౌలింగ్‌లో ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో SRH 175 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

18 May 2026 11:30 PM (IST)

CSK vs SRH Live Score Updates: 18వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ (70) దుమ్ములేపాడు. ఒక ఫోర్, సిక్సర్ బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. దీంతో 12 బంతుల్లో 15 పరుగులుగా సమీకరణ మారింది. స్కోరు: 168-4 (18).

18 May 2026 11:22 PM (IST)

CSK vs SRH Live Score Updates: 17వ ఓవర్‌లో అన్షుల్ కాంబోజ్ పది పరుగులు ఇచ్చాడు. 18 బంతుల్లో 28 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. స్కోరు: 153-3.

18 May 2026 11:14 PM (IST)

CSK vs SRH Live Score Updates: ఇషాన్ కిషన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 16వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 38 రన్స్ కావాలి. స్కోరు: 143-3(16).

18 May 2026 11:08 PM (IST)

CSK vs SRH Live Score Updates: సంజు శాంసన్ సూపర్ స్టంపింగ్‌తో హెన్రిచ్ క్లాసెన్ (47)ను ఔట్ చేశాడు. దీంతో 131 పరుగుల వద్ద SRH మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 137-3 (15).

18 May 2026 11:01 PM (IST)

CSK vs SRH Live Score Updates: శివమ్ దూబె వేసిన 14వ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. క్లాసెన్(43) రెండు ఫోర్లు కొట్టాడు. స్కోరు: 126-2

18 May 2026 10:55 PM (IST)

CSK vs SRH Live Score Updates: 13వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ (46) బ్యాట్ ఝులిపించాడు. ఒక సిక్సర్, ఫోర్ బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. స్కోరు: 114-2 (13).
 

18 May 2026 10:45 PM (IST)

CSK vs SRH Live Score Updates: జాన్సన్ వేసిన 12వ ఓవర్‌లో 9 రన్స్ వచ్చాయి. ఇషాన్ కిషన్ ఒక ఫోర్ కొట్టాడు. స్కోరు: 98-2 (12).

18 May 2026 10:39 PM (IST)

CSK vs SRH Live Score Updates: 11వ ఓవర్‌లో క్లాసెన్ సిక్సర్, ఫోర్ బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 89-2 (11).

18 May 2026 10:35 PM (IST)

CSK vs SRH Live Score Updates: 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి SRH రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. పదో ఓవర్లో క్లాసెన్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు.
 

18 May 2026 10:30 PM (IST)

CSK vs SRH Live Score Updates: 9వ ఓవర్‌లో 7 రన్స్ వచ్చాయి. క్లాసెన్ ఒక బౌండర బాదాడు. స్కోరు: 64-2 (9).

18 May 2026 10:25 PM (IST)

CSK vs SRH Live Score Updates: సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్ తగిలింది. అకేల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. అభిషేక్ శర్మ (26) ఔట్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 57-2 (8).

18 May 2026 10:19 PM (IST)

CSK vs SRH Live Score Updates: సన్‌రైజర్స్ స్కోరు 50 పరుగులు దాటింది. నూర్ అహ్మద్ వేసిన 7వ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అభిషేక్ (25) సిక్సర్ బాదాడు. ఇషాన్ కిషన్ (21) కూడా క్రీజ్‌లో సెట్ అయ్యాడు. హైదరాబాద్ విజయం సాధించాలంటే.. 78 బంతుల్లో 128 పరుగులు కావాలి. స్కోరు: 53-1 (7).

18 May 2026 10:14 PM (IST)

CSK vs SRH Live Score Updates: పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక సిక్సర్ బాదాడు. అయినా ఈ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 45-1 (6).

18 May 2026 10:08 PM (IST)

CSK vs SRH Live Score Updates: ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. విజయానికి 90 బంతుల్లో 143 పరుగులు కావాలి. స్కోరు: 38-1 (5).

18 May 2026 10:03 PM (IST)

CSK Vs SRH Live Score Updates: జాన్సన్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ మూడు బౌండరీలు బాదడంతో 12 పరుగులు వచ్చాయి. స్కోరు: 31-1 (4).

18 May 2026 09:58 PM (IST)

CSK Vs SRH Live Score Updates: ట్రావిస్ హెడ్ (6)ను ముకేష్‌ చౌదరి ఔట్ చేశాడు. హెడ్ భారీ షాట్‌కు యత్నించి.. అతనికే క్యాచ్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. స్కోరు: 19-1 (3).

18 May 2026 09:53 PM (IST)

CSK Vs SRH Live Score Updates: రెండో ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ ఒక ఫోర్ కొట్టాడు. స్కోరు: 15-0 (2).

18 May 2026 09:47 PM (IST)

CSK Vs SRH Live Score Updates: తొలి ఓవర్‌లో అభిషేక్ శర్మ రెండు బౌండరీలు బాదాడు. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చాడు. తొలి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.

18 May 2026 09:29 PM (IST)

CSK Vs SRH Live Score Updates: సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ, ప్రపూల్ హింగే తలో వికెట్ పడగొట్టాడరు. 181 పరుగుల లక్ష్యంతో SRH బరిలోకి దిగనుంది.

18 May 2026 09:27 PM (IST)

CSK Vs SRH Live Score Updates: చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

18 May 2026 09:20 PM (IST)

CSK Vs SRH Live Score Updates: శివమ్ దూబె (26)ను హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 164 పరుగుల వద్ద చెన్నై ఆరో వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. స్కోరు: 172-6(19).

18 May 2026 09:15 PM (IST)

CSK Vs SRH Live Score Updates: బ్రెవిస్‌ (44)ను సూపర్ బాల్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు ఇషాన్ మలింగ. 18వ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. స్కోరు: 159-5.

18 May 2026 09:08 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 17వ ఓవర్‌లో హుస్సేన్ 7 పరుగులు ఇచ్చాడు. దూబే ఒక ఫోర్ కొట్టాడు. స్కోరు: 151-4 (17).

18 May 2026 09:02 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 16వ ఓవర్ల ఆట ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దూబే (16), బ్రెవిస్ (35) క్రీజ్‌లో ఉన్నారు.

18 May 2026 08:56 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 15వ ఓవర్‌లో ఇషాన్ మలింగ 10 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో దూబే ఓ సిక్సర్ బాదాడు. స్కోరు: 132-4 (15).

18 May 2026 08:50 PM (IST)

CSK Vs SRH Live Score Updates: నితీష్ కుమార్ రెడ్డి వేసిన 14వ ఓవర్‌లో దూబే ఒక ఫోర్ బాదగా.. బ్రెవిస్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. స్కోరు 122-4 (14).

18 May 2026 08:45 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 13వ ఓవర్‌లో శివాంగ్ కేవలం నాలుగు పరుగులు ఇచ్చాడు. స్కోరు: 104-4 (13).

18 May 2026 08:39 PM (IST)

CSK Vs SRH Live Score Updates: కెప్టెన్ రుతురాజ్ స్లో ఇన్నింగ్స్‌కు కమిన్స్ ముగింపు పలికాడు. 21 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన గైక్వాడ్.. ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. భారీ షాట్‌కు యత్నించగా.. ఇషాన్ మలింగ చేతికి చిక్కాడు. శివమ్ దూబే క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 100-4 (12).

18 May 2026 08:33 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 11వ ఓవర్లో సాకిబ్ హుస్సేన్ 8 పరుగులు వచ్చాయి. బ్రెవిస్ ఓ సిక్సర్ బాదాడు. స్కోరు: 99-3 (11).

18 May 2026 08:30 PM (IST)
18 May 2026 08:28 PM (IST)

CSK Vs SRH Live Score Updates: ప్యాట్ కమిన్స్ మరోసారి చెన్నైను దెబ్బ తీశాడు. జోరు మీదున్న కార్తీక్ శర్మ 32 (19)ను పెవిలియన్‌కు పంపించాడు. బౌండరీ లైన్ వద్ద నితీష్ కుమార్ రెడ్డి చక్కటి క్యాచ్ అందుకున్నాడు. బ్రెవిస్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 91-3(10).

18 May 2026 08:21 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 9 ఓవర్ల ఆట ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజ్‌లో ఉన్నారు. 
 

18 May 2026 08:17 PM (IST)

CSK Vs SRH Live Score Updates: ప్రపూల్ హింగే వేసిన 8వ ఓవర్‌లో కార్తీక్ శర్మ బ్యాట్ ఝులిపించాడు. తొలి మూడు బంతుల్లో 4, 6, 4 బాదాడంతో ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. స్కోరు: 79-2 (8).

18 May 2026 08:11 PM (IST)

CSK Vs SRH Live Score Updates: 7వ ఓవర్‌లో స్పిన్నర్ శివాంగ్‌ను బౌలింగ్‌కు దించాడు కెప్టెన్ కమిన్స్. ఆరు బంతులకు ఆరు సింగిల్స్ వచ్చాయి. స్కోరు: 63-2 (7).

18 May 2026 08:07 PM (IST)

CSK Vs SRH Live Score Updates: పవర్‌ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌లో ఇషాన్ మలింగ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆరు ఓవర్లలో చెన్నై రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

18 May 2026 08:04 PM (IST)

CSK Vs SRH Live Score: ఐదో ఓవర్‌ చివరి బంతిని కార్తీక్ శర్మ బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా ఆరు పరుగులు వచ్చాయి. స్కోరు: 52-2 (5).

18 May 2026 08:00 PM (IST)

CSK Vs SRH Live Score: చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఉర్విల్ పటేల్ (13)ను సాకిబ్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కార్తీక్ శర్మ క్రీజ్ లోకి వచ్చాడు.

18 May 2026 07:55 PM (IST)

CSK Vs SRH Live Score: ఇషాన్ మలింగ నాలుగో ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 46-1 (4).

18 May 2026 07:50 PM (IST)

CSK Vs SRH Live Score: ఉర్విల్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చి రాగానే.. రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. CSK Vs SRH Score: 43-1(3).

18 May 2026 07:47 PM (IST)

CSK Vs SRH Live Score: దూకుడు మీదున్న సంజు శాంసన్‌ 27 (13)ను కమిన్స్ ఔట్ చేశాడు. 31 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది.

18 May 2026 07:43 PM (IST)

CSK Vs SRH Live Score: రెండో ఓవర్‌ను ప్రఫుల్ హింగే వేయగా.. చివరి మూడు బంతులను సంజు శాంసన్ బౌండరీలు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. స్కోరు: 30-0 (2).

18 May 2026 07:36 PM (IST)

CSK Vs SRH Live Score: తొలి బంతిని నితీష్ కుమార్ రెడ్డి నో బాల్ వేయగా.. ఫ్రీ హిట్‌ను సంజు శాంసన్ సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని బౌండరీ బాదాడు. చివరికి బంతిని కూడా ఫోర్‌ కొట్టడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి.

18 May 2026 07:32 PM (IST)

CSK Vs SRH Live Score: సన్‌రైజర్స్‌ నుంచి నితీష్‌ కుమార్ రెడ్డి బౌలింగ్ దాడి మొదలు పెట్టగా.. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా వచ్చారు.

18 May 2026 07:18 PM (IST)

CSK Vs SRH Live Score: 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ముఖేష్ చౌదరి, మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, గుర్జాప్నీత్ సింగ్

18 May 2026 07:10 PM (IST)

CSK Vs SRH Live Score: ఈ మ్యాచ్‌ కోసం ధోనీ ఇక్కడే ఉన్నారని.. కానీ మ్యాచ్‌ ఆడేంత ఫిట్‌గా లేరని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామన్నాడు. సన్‌రైజర్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు ఇలా..

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్.

18 May 2026 07:04 PM (IST)

CSK Vs SRH Live Score: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది. 

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.