)
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: గత 17 సీజన్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు తన జెర్సీ నంబరు 18.. 18వ సీజన్‌లో తన కలను నెరవేర్చుకున్నాడు. ఆర్‌సీబీ విజయంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: చివరి ఓవర్‌లో పంజాబ్ 29 పరుగులు చేయాల్సి ఉండగా.. శశాంక్ సింగ్ 22 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులను హేజిల్‌వుడ్ డాట్ బాల్స్ వేయడంతో ఆర్‌సీబీ గెలుపు అప్పటికే ఖాయమైంది. ఆర్‌సీబీ 6 పరుగులతో విజయం సాధించి.. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరింది. ఫైనల్‌లో పంజాబ్‌ను చిత్తు చేసి.. తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆర్‌సీబీ విజయంతో విరాట్ కోహ్లీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: భువనేశ్వర్ వేసిన 19 ఓవర్‌లో శశాంక్ సింగ్ 13 పరుగులు రాబట్టాడు. ఆరు బంతుల్లో 29 పరుగులు చేస్తే పంజాబ్ విజయం సాధిస్తుంది.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: కొత్త ఛాంపియన్‌గా అవతరించేందుకు ఆర్‌సీబీ మరింత చేరువ అయింది. పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే 12 బంతుల్లో 42 పరుగులు చేయాలి. స్కోరు: 150-7.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఒకే ఓవర్‌లో నేహల్ వధేరా (15), స్టొయినిస్ (6) వికెట్లను పడగొట్టి.. ఆర్‌సీబీని రేసులోకి తీసుకువచ్చాడు. పంజాబ్ విజయం సాధించాలంటే.. 18 బంతుల్లో 47 రన్స్ చేయాలి.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 16 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ 136 పరుగులు చేసింది. నేహల్ వధేరా (22), శశాంక్ సింగ్ (15) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ విజయం సాధించాలంటే 24 బంతుల్లో 55 పరుగులు కావాలి.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: 14 ఓవర్‌లో ముగిసేసరికి పంజాబ్ స్కోరు 106/4 పరుగులుగా ఉంది. విజయం సాధించాలంటే 36 బంతుల్లో 86 పరుగులు కావాలి.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: జోరు మీద ఉన్న జోష్ ఇంగ్లిష్ (39)ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద లివింగ్‌స్టోన్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: 12 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిష్ (39) జోరు కొనసాగిస్తున్నాడు. పంజాబ్ విజయానికి 48 బంతుల్లో 93 రన్స్ కావాలి.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: పంజాబ్‌కు ఊహించని షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. షెపర్డ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. నేహల్ వధేరా క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 81/3 (10).
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26)ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు బోర్డు: 74-2 (9).
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: ఎనిమిదో ఓవర్‌లో పంజాబ్ 15 పరుగులు పిండుకుంది. సుయాష్ వేసిన ఈ ఓవర్‌లో జోష్ ఇంగ్లిష్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చెరో సిక్సర్ బాదారు. స్కోరు: 70/1 (8).
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (17), జోష్ ఇంగ్లిష్ (9) క్రీజ్‌లో ఉన్నారు.
Royal Challengers Bengaluru vs Punjab King Live Cricket Score: ఐదో ఓవర్‌లో పంజాబ్‌కు తొలిషాక్ తగిలింది. ప్రియాన్ష్ ఆర్య (24)ను జోష్ హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. స్కోరు: 43-1.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: మూడో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ క్యాచ్‌ను షెపర్ట్ వదిలిపెట్టాడు. ఈ ఓవర్‌లో కేవల ఐదు పరుగులు వచ్చాయి. స్కోరు: 28-0.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఓపెనర్లుగా వచ్చారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే ప్రియాన్ష్ బౌండరీకి తరలించాడు. చివరి బంతిని ప్రభ్‌సిమ్రాన్ సిక్సర్‌గా మలిచాడు. తొలి ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: 191 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షెపర్డ్ (17), కృనాల్ పాండ్యా (4), భువనేశ్వర్ (1) వికెట్లను తీసి కేవలం 3 పరుగులు ఇచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సీబీ 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: 19 ఓవర్‌లో షెపర్ట్ సిక్స్, ఫోర్ బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 187-6.
RCB Vs PBKS IPL 2025 Live Score Updates: జోరు మీద ఉన్న జితేశ్ శర్మ (24)ను వైషాక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 18 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 173-6గా ఉంది.
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: 17 ఓవర్‌లో ఆర్‌సీబీ 22 పరుగులు చేసింది. జితేశ్ శర్మ రెండు సిక్సర్లు బాదగా.. లివింగ్‌స్టోన్ ఒక సిక్స్ కొట్టాడు. మూడు వైడ్లు కూడా వేసిన జేమిసన్.. లివింగ్‌స్టోన్ (25)ను ఔబ్ చేసి పంజాబ్‌కు ఊరట కల్పించాడు. స్కోరు: 168-5.
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (19), జితేశ్ శర్మ (11) క్రీజ్‌లో ఉన్నారు.
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్‌షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ (43)ను అజ్మతుల్లా ఔట్ చేశాడు.
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: చాహల్ వేసిన 14వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 125/3 (14).
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. లివింగ్‌స్టోన్ (6) కోహ్లీకి సహకారం అందిస్తున్నాడు. స్కోరు బోర్డు: 111/3 (13).
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: ఆర్‌సీబీకి మరో బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రజత్ పటీదార్ (26) జేమిసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆర్‌సీబీ స్కోరు: 97-3 (11)
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: పది ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (27), రజత్ పటీదార్ (18) క్రీజ్‌లో ఉన్నారు.
మొదటి విరామానికి బెంగళూరు స్కోర్ 80, రెండు వికెట్లతో పంజాబ్ దూకుడు
==> ఎనిమిదో ఓవర్ వైశాక్ వేయగా బెంగళూరు స్కోర్ 69/2. విరాట్ కోహ్లీ 19 పరుగులు, పటిదర్ 8 పరుగులతో కొనసాగుతున్నారు.
==> 9వ ఓవర్ చాహల్ బంతిని అందుకోగా ఈ ఓవర్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ గేర్ మార్చాడు. మూడో బంతికి అద్భుతమైన సిక్స్ బాదాడు. కోహ్లీ (21), టిదార్ (17) పరుగులతో నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారు.
9వ ఓవర్ పరుగులు 0,1,6,2,1,1
చాహల్‌కు ఏడోసారి దొరికిన మయాంక్ అగర్వాల్
==> పవర్ ప్లే అనంతరం బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏడో ఓవర్ రెండో బంతి వేయగా మయాంక్ అగర్వాల్ క్యాచ్ ఇచ్చేసి ఔటయ్యాడు. 18 బంతుల్లో 21 పరుగులు చేసి మయాంక్ వెనుదిరిగాడు. కోహ్లీ (1౭)తో కెప్టెన్ రజత్ పాటిదర్ (2) ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
ఏడో ఓవర్ స్కోర్ 1,వైడ్, 1,2,1,1,
పవర్ ప్లేలో బెంగళూరు 55 పరుగులు మాత్రమే
==> భారీ స్కోర్ రాబడుతుందనుకుంటే పవర్ ప్లేలో నామమాత్రం పరుగులు వచ్చాయి. కేవలం 55 పరుగులు మాత్రమే రాగా.. పంజాబ్ బౌలర్లు కొంత పైచేయి ప్రదర్శించినట్టు కనిపిస్తోంది.
==> పంజాబ్ బౌలర్‌ను మార్చి ఐదో ఓవర్‌కు ఒమర్జయ్‌ను రంగంలోకి దింపింది.
ఐదో ఓవర్ ఒమర్‌జాయ్ వేయగా.. స్కోర్ 46/1
==> బెంగళూరు స్కోర్ నెమ్మదించింది. పవర్ ప్లేలో ఐదో ఓవర్‌కు కేవలం ఏడు పరుగులు మాత్రమే నమోదు చేసింది. మయాంక్ అగర్వాల్, కోహ్లీ ఇంకా దూకుడైన బ్యాటింగ్‌ను ఆరంభించలేదు.
ఐదో ఓవర్ కు స్కోర్ 1,1,1,1,2,1,
ఆరో ఓవర్ వైశాఖ్.. స్కోర్ 55/1
పవర్ ప్లేలో ఆరో ఓవర్‌ను వైశాక్ వేశాడు. మయాంక్ అగర్వాల్ (24), విరాట్ కోహ్లీ (13) నిలకడగా ఆడుతున్నారు.
ఆరో ఓవర్ స్కోర్ 0,1,2,4,2,1
పొదుపుగా ఆడుతున్న బెంగుళూరు
మూడో ఓవర్ అర్ష్‌దీప్ వేయగా.. స్కోర్ 30/1
==> ఫిల్ సాల్ట్ నిష్క్రమణతో భారీ స్కోర్‌ను సాధించేందుకు విరాట్ కోహ్లీ (2), మయాంక్ అగర్వాల్ (10) భారీ ఇన్నింగ్స్ నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాల్ట్ ఔటవడంతో పరుగులు నెమ్మదిగా తీస్తున్నారు. వీరిద్దరూ కుదురుకుంటే భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది.
మూడో ఓవర్ లో వచ్చిన పరుగులు 2,0,1,1,వైడ్,0,6
నాలుగో ఓవర్ జేమిసన్ వేయగా.. స్కోర్ 39/1
సాల్ట్‌ను ఔట్ చేసి భారీ షాక్ ఇచ్చిన జేమెసన్ నాలుగో ఓవర్ వేయగా.. తొలి బంతికే ఫోర్ కట్టి బౌలర్‌కు ఆహ్వానం పలికాడు. కోహ్లీ కూడా దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించగా.. మయాంక్ అగర్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఒత్తిడిలో బ్యాటర్లు ఉన్నట్టు కనిపిస్తోంది.
నాలుగో ఓవర్ స్కోర్
4,1,4,0,0,0
రెండో ఓవర్‌కే భారీ షాక్
==> రెండో ఓవర్ జేమిసన్ వేయగా.. సాల్ట్‌కు కోహ్లీ మంచి సహకారం అందిస్తూ భారీ స్కోర్ రాబట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారీ షాక్ తగిలింది. నాలుగో బంతికి సాల్ట్ చిక్కాడు. శ్రేయస్ అయ్యర్ మంచి క్యాచ్ పట్టి బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చాడు. 16 పరుగులతో సాల్ట్ వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ తో కలిసి కోహ్లీ భారీ స్కోర్ నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
రెండో ఓవర్ పరుగులు
1,4,0,వికెట్,1,1
దంచికొడుతున్న సాల్ట్, కోహ్లీ
==> తొలి ట్రోఫీ అందుకునేందుకు అహ్మదాబాద్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ప్రారంభించింది. అర్ష్‌దీప్ తొలి ఓవర్ వేయగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగారు. తొలి బంతిని అర్ష్‌దీప్ వైడ్‌తో ప్రారంభించాడు. వైడ్, 0,0,6,2,4,0తో తొలి ఓవర్ ముగిసింది. తొలి ఓవర్‌లో 12 పరుగులు లభించాయి.
RCB Vs PBKS IPL 2025 Final Playing 11: తుది జట్లు ఇలా..
పంజాబ్ కింగ్స్ : ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ ధయాల్, జోష్ హేజిల్‌వుడ్
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: ఐపీఎల్ ఫైనల్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. బౌలింగ్ ఎంచుకుంది.
Lighting up the #Final with an enthusiastic Tribute Ceremony ??#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/b0WptvNnIO
— IndianPremierLeague (@IPL) June 3, 2025
RCB Vs PBKS Dream11 Team Tips: ఆర్‌సీబీ, పంజాబ్ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? తుది జట్లు ఎలా ఉంటాయి..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోకి ఆర్‌సీబీ అభిమానులు దూసుకుపోయారు.
THIS IS WHAT RCB HAS ACHIEVED - THE STREETS WILL GO MAD.
- The unmatchable love and support for RCB. (Subhayan Chakraborty). pic.twitter.com/TWlsIY810S
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2025
RCB Vs PBKS IPL 2025 Live Scorecard: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడితే ఎలా..? విజేతను ఎలా నిర్ణయిస్తారు..? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Royal Challengers Bengaluru Vs Punjab Kings LIVE Score Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో అదిరిపోయే పర్ఫామెన్స్తో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్ చేరుకోగా.. క్వాలిఫయర్-2లో ముంబైను చిత్తు చేసి పంజాబ్ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు జట్లు కూడా గత 17 సీజన్లుగా తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్‌సీబీ నాలుగోసారి ఫైనల్‌కు చేరుకోగా.. పంజాబ్ రెండోసారి ఫైనల్ చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్, రజత్ పటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి చెప్పే ఆర్‌సీబీ కప్ కొడుతుందా..? పంజాబ్ కింగ్స్ సరికొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుందా..? ఐపీఎల్ 2025 ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.